Pope Francis: ఆన్‭లైన్ పోర్నోగ్రఫీ దెయ్యం, మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలంటూ పోప్ ఫ్రాన్సిస్ వార్నింగ్

డిజిటల్ పోర్నోగ్రఫీ అనుభవం లేదంటే టెంప్టేషన్ ఉంటే మీరు ఇక దాని గురించే ఆలోచిస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది. చాలా మంది సామాన్యులు, మహిళలు, ప్రీస్టులు, సన్యాసినులు కూడా ఈ ప్రభావానికి లోనవుతున్నారు. నేను కేవలం క్రిమినల్ పోర్నోగ్రఫీ గురించి మాత్రమే మాట్లాడటం లేదు. పసిపిల్లలపై వేధింపులు ఇందులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి

Pope Francis: ఆన్‭లైన్ పోర్నోగ్రఫీ దెయ్యం, మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలంటూ పోప్ ఫ్రాన్సిస్ వార్నింగ్

Pope Francis warns the ‘devil enters’ through online pornography

Pope Francis: ఆన్‭లైన్ పోర్నోగ్రఫీపై పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది దెయ్యంలా తయారైందని, దాని వల్ల అర్చక హృదయాలు కూడా బలహీనపడుతున్నాయని అన్నారు. మొబైల్ ఫోన్ల నుంచి దాన్ని వెంటనే తొలగించాలని ఆయన హెచ్చరించారు. రోమ్‭లో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో డిజిటల్, సోషల్ మీడియాల పని తీరు గురించి ఆయనను ప్రశ్నించగా పై విధంగా సమాధానం చెప్పారు.

‘‘డిజిటల్ పోర్నోగ్రఫీ అనుభవం లేదంటే టెంప్టేషన్ ఉంటే మీరు ఇక దాని గురించే ఆలోచిస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది. చాలా మంది సామాన్యులు, మహిళలు, ప్రీస్టులు, సన్యాసినులు కూడా ఈ ప్రభావానికి లోనవుతున్నారు. నేను కేవలం క్రిమినల్ పోర్నోగ్రఫీ గురించి మాత్రమే మాట్లాడటం లేదు. పసిపిల్లలపై వేధింపులు ఇందులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అని పోప్ అన్నారు.

నిజానికి పోప్ ఫ్రాన్సిస్ మొబైల్ ఫోన్ వాడరట. కానీ ఇతరుల్ని వాడొద్దని తాను చెప్పనని అంటున్నారు. ఇతరులతో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, విశ్వాసాన్ని పెంచుకోవడానికి మొబైల్ ఫోన్ ఉపయోగించడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. ‘‘స్వచ్ఛమైన ఏ హృదయాన్నైనా జీసస్ ప్రతిరోజు స్పర్శిస్తాడు. కానీ ఇలాంటి అశ్లీల సమాచారాన్ని మాత్రం ఆయన తాకలేరు’’ అని ఆయన అన్నారు. మొబైల్ ఫోన్లో ఆన్‭లైన్ పోర్నోగ్రఫీకి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తొలగించాలని ఆయన హెచ్చరించారు.

Russia-Ukraine War..’dirty bomb’ : డర్టీ బాంబ్ అంటే ఏంటి? ఈ బాంబులను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గా ఎందుకు అంటారు? వీటి ప్రభావం ఎలా ఉంటుంది..?