ఎరక్కపోయి ఇరుక్కున్న తెలంగాణ ఎన్ఆర్ఐ : ప్రసవానికి హాస్పిటల్ వేసిన బిల్లు రూ. 5కోట్లు

  • Published By: vamsi ,Published On : November 7, 2019 / 03:32 AM IST
ఎరక్కపోయి ఇరుక్కున్న తెలంగాణ ఎన్ఆర్ఐ : ప్రసవానికి హాస్పిటల్ వేసిన బిల్లు రూ. 5కోట్లు

ప్రసవానికి హాస్పిటల్‌కు పోతే ఎంత ఖర్చు అవుతుంది. మహా అయితే రూ. 18వేలు అవుతుంది. అయితే ఓ ఎన్ఆర్ఐకు మాత్రం ఎంత అయ్యిందో తెలిస్తే గుండె గుబేలుమంటుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నాడు ఓ తెలంగాణ యువకుడు. ముచ్చటపడి విజిటింగ్‌ వీసాపై భార్యను గల్ఫ్‌కు తీసుకుని పోయిన  ఎన్ఆర్ఐ అటువంటి కష్టమే వచ్చింది.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మల్లపల్లికి చెందిన సయ్యద్‌ జహీద్‌ కొంతకాలంగా సౌదీలో ఉఃద్యోగ నిమిత్తం వెళ్లి పనిచేస్తున్నాడు. విజిటింగ్‌ వీసాపై ఏడాది క్రితం భార్యను సౌదీకి తీసుకుని వచ్చాడు సయ్యద్. అక్కడ ఆమె గర్భం దాల్చగా.. ఏడోనెలలోనే ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో రియాద్‌లోని సులేమాన్‌ హబీబ్‌ ఆస్పత్రిలో చేర్పించాడు ఎన్ఆర్ఐ. అక్కడ నలుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది అతని భార్య.
ఆసుపత్రి ఖర్చుల కోసం ఇప్పటికే అతను దాచుకున్న రూ.4.31లక్షలను జహీద్‌ అప్పుడు చెల్లించాడు. పిల్లలు బరువు తక్కువగా ఉండటంతో ఇన్‌క్యూబెటర్లలో చికిత్స అందించారు. ఇందుకోసం ప్రతి శిశువుకు రోజుకు 10వేల రియాల చొప్పున ఖర్చయ్యింది. అంటే రోజుకు నలుగురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.7లక్షలు. రెండు నెలలడ పాటు పిల్లలను ఇంటెన్సివ్ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స చేయాలని, అందుకు రూ.4.50 కోట్లు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
దీనికి మందుల ఖర్చుతో సహా మొత్తం రూ.5కోట్లు వరకు అవుతుంది. జహీద్‌ అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకుని రావాలో తెలియక సాయం కోసం అందరినీ అర్థిస్తున్నాడు. తన భార్య గర్భవతి అని తెలిసిన వెంటనే స్వదేశానికి పంపాలని అనుకున్నానని చెప్తున్నారు. అయితే ఎయిర్‌లైన్స్‌ అధికారులు అనుమతించలేదని అంటున్నాడు జవీద్. దీంతో ఇక్కడే ఉంచాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.