Joe Biden Viral Video : బ్యాంకుల సంక్షోభం గురించి ప్రశ్నించిన మీడియా..సమాధానం చెప్పకుండా వేరే రూమ్‌లోకెళ్లి డోర్ వేసేసుకున్న బైడెన్
అమెరికాలో బ్యాంకుల సంక్షోభం గురించి అధ్యక్షుడు జోబైబెన్ ను మీడియా ప్రశ్నిస్తుండగానే.. సమాధానం చెప్పకుండా..మధ్యలో లేచి వేరే రూమ్‌లోకెళ్లి డోర్ వేసేసుకున్నారు బైడెన్.

joe biden leaves press meet mid way after reporter questioned him on us banking crisis
Joe Biden Viral Video : అమెరికా అధ్యక్షుడు స్థానంలో ఎవరు ఉన్నా నిత్యం వార్తల్లో ఉండటం సర్వసాధారణమే..మరి పెద్దన్న అంటే అంతేమరి. ఏదోక విషయంలో అమెరికా అధ్యక్షుడు వార్తల్లో ఉంటుంటారు. కానీ జో బైడెన్ మాత్రం వినూత్నంగా వార్తల్లో నిలుస్తుంటారు. నడుస్తూ నడుస్తూ బైడెన్ తడబడిపోయి పడిపోవటం, లేదా సమావేశాల్లో మాట్లాడుతూ కొంతమంది పేర్లు ప్రస్తావించినప్పుడు వారి పేర్లు మర్చిపోవటం వంటి వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి జోడైన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ సిలికాన్ వ్యాలి మూతపడింది.
ఈ క్రమంలో మీడియా సమావేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ..డిపాజిటర్ల డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. దీంతో మీడియా ప్రతినిథులు ‘ మిస్టర్ ప్రెసిడెంట్..అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది, దీనికి మీరేం చెబుతారు? అమెరికన్లకు ఎటువంటి భరోసా ఇస్తారు?దీనికి మీ వద్ద ఎటువంటి సమాచారం ఉంది? అంటూ సూటిగా ప్రశ్నించారు. అలా జర్నలిస్టులు ప్రశ్నలు వేస్తూ ఉండగానే బైడెన్ మాత్రం అవేవీ తనకు వినిపించుకోనట్లుగా కూల్ గా అక్కడనుంచి వెళ్లిపోయారు. వెనక్కితిరిగి చూడకుండా డోర్ తెరుచుకుని లోపలికి వెళ్లి తిరిగి డోర్ వేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా..మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నిస్తుంటే.. మధ్యలోనే వెళ్లిపోవడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్తేకాదు..ఇటువంటివి గతంలో పలుమార్లు జరిగాయి.
Joe Biden : అయ్యో..మళ్లీ తడబడిన బైడెన్ .. విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డ ప్రెసిడెంట్
కాగా అమెరికాలో రెండు బ్యాంకుల్లో సంక్షోభం తలెత్తింది. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ సిలికాన్ వ్యాలి మూతపడింది. ఇలా బ్యాంకు సంక్షోభం గురించి బైడెన్ మాట్లాడుతూ.. తమ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని..డిపాజిటర్ల డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. దీతో విలేకరులు ‘అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది? దీనికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఈ సంక్షోభం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అమెరికన్లకు ఎటువంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు?మరిన్ని బ్యాంకులకు ఇలాంటి పరిస్థితేరానుందా?అంటూ ప్రశ్నలు సంధించారు.
ఈ ప్రశ్నలు విన్న బైడెన్ మరి సమాధానం చెప్పలేకో..లేదా వేరే కారణాలో తెలియదు కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా..అక్కడనుంచి వెళ్లిపోతూ కనీసం వెనక్కి చూడకుండా మీడియా సమావేశం జరుగుతున్న రూమ్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్లి తిరిగి డోర్ వేసేసుకుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైడెన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
అయితే విలేకరులు సమావేశం నుంచి మధ్యలో బైడెన్ వెళ్లిపోవడం చాలాసార్లే జరిగింది. ఇటీవల కాలంలో అమెరికా గగనతలంపై చైనా నిఘా బెలూన్ తీవ్ర కలకలం రేపిన సందర్భంగా మీడియా ప్రశ్నిస్తుండగా కూడా బైడెన్ అలా మధ్యలో లేచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై మీడియా చైనాలో మీ కుటుంబానికి సంబంధించి వ్యాపారాలు ఉన్నాయి కదా..వాటికి భద్రత ఉండదని భావించారా? అందుకే చైనా బెలూన్ విషయాలో రాజీ పడ్డారా? అంటూ మీడియా సూటిగా ప్రశ్నించింది. దీనికి బైడెన్ నాకు కొంచె బ్రేక్ కావాలి అంటూ మీడియా సమావేశంనుంచి వెళ్లిపోయారు. అదికూడా అప్పట్లో వైరల్ అయ్యింది.
బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు విదేశాల్లో ఉండే వ్యాపారాలపై పలు విమర్శలు వినిపిస్తుంటాయి. హంటర్‌కు స్కానియాటిలిస్ ఎల్‌ఎల్‌సీ ద్వారా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్‌ఆర్ పార్ట్నర్స్‌లో ఇప్పటికీ 10 శాతం వాటా ఉందని అమెరికన్ మీడియా వెల్లడించింది.
కాగా అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత అమెరికాలో పెను సంచలనం కలిగిస్తోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకు కూడా మూతపడింది.ఇలా అమెరికాలో బ్యాంకు వ్యవస్థలపై ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కానీ బైడెన్ మాత్రం బ్యాంకు వ్యవస్థలపై భరోసా కల్పించే యత్నం చేస్తుండగా మీడియా అడిగే ప్రశ్నల నుంచి తనదైనశైలిలో మరోసారి ఎస్కేప్ అయి మరోసారి వైలర్ అవుతున్నారు బైడెన్..
“Can you assure Americans that there won’t be a ripple effect? Do you expect other banks to fail?”
BIDEN: *shuts door* pic.twitter.com/CNuUhPbJAi
— RNC Research (@RNCResearch) March 13, 2023