మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం.. నాటుసారా తాగి 27 మంది మృతి

ఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 02:16 AM IST
మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం.. నాటుసారా తాగి 27 మంది మృతి

ఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది.

ఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది. ఖుజెస్తాన్, అల్బోర్జ్ లో నాటుసారా తాగి 27 మంది మృతి చెందారు. 218 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది. లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. 113 దేశాలకు వైరస్ పాకింది. కరోనా వైరస్ చైనాలో తగ్గి ఇతర దేశాల్లో పెరుగుతోంది. 

ఇటలీలో నిన్న ఒక్కరోజే 1797 కేసులు నమోదు అయ్యాయి. 97 మంది మృతి చెందారు. ఇరాన్ లో నిన్న 595 కేసులు నమోదు అయ్యాయి. 43 మంది మృతి చెందారు. చైనాలో కేవలం 4 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. (113 దేశాలకు పాకిన కరోనా వైరస్…ప్రపంచవ్యాప్తంగా 4 వేల 9 మంది మృతి)

మార్చి 9నాటికి భారత్‌లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణాలు ఏం కనిపించినా కింది సెంటర్లలో సంప్రదించాలని వైద్యులు అంటున్నారు.