Pakistan Accident : ఒక్కరోజులోనే వెయ్యి ప్రమాదాలు..చనిపోయింది ఎంత మందో తెలుసా ?

ఒక్కరోజులోనే వెయ్యి యాక్సిడెంట్స్ జరిగినా..11 మంది మాత్రమే చనిపోయారు...ఈ ప్రమాదాల్లో మొత్తం 1016 మందికి గాయాలు కాగా...

Pakistan Accident : ఒక్కరోజులోనే వెయ్యి ప్రమాదాలు..చనిపోయింది ఎంత మందో తెలుసా ?

Road Accident

Updated On : December 27, 2021 / 8:20 PM IST

Punjab Faces Over 1000 : దేశంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమై పోయింది. ఎక్కడో ఒకచోట జరుగుతున్న యాక్సిడెంట్స్ లో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఒక్కరోజులో ఎన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంటే..ఏదో నాలుగైదు లేదా…ఓ పది వరకు జరిగే అవకాశాలున్నాయని అంచనా వేయవచ్చు. కానీ..ఒక్కరోజులోనే వెయ్యి ప్రమాదాలు చోటు చేసుకున్నాయంటే నమ్మవచ్చా ?

Read More : Delhi : రెండు చేతులు, కాళ్లు లేవు..అయినా బండి నడుపుతున్నాడు..ఉద్యోగం ఇచ్చిన ఆనంద్ మహీంద్ర

ఒక్కరోజులోనే వెయ్యి యాక్సిడెంట్స్ జరిగినా..11 మంది మాత్రమే చనిపోయారు. పాక్ లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ లో ఒక్కరోజే భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. లాహోర్ లో అత్యధికంగా 222 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 1016 మందికి గాయాలు కాగా…వీరిలో 576 మందికి తీవ్రగాయాలయ్యాయి. 440 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 466 మంది ప్రయాణీకులున్నారు. 425 మంది డ్రైవర్లు ఉండగా…136 మంది రోడ్డు మీద నడుచుకుంటున్న వారు ఉన్నారు. డ్రైవింగ్ చేసే వయస్సు లేని వాళ్లే అధికంగా ఉన్నారు.