Delhi : రెండు చేతులు, కాళ్లు లేవు..అయినా బండి నడుపుతున్నాడు..ఉద్యోగం ఇచ్చిన ఆనంద్ మహీంద్ర

దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు, చేతులు లేవు. అయినా..ప్రత్యేకంగా ఓ ట్రాలీ వాహనం నడుపుతున్నాడు. మహీంద్రా కంపెనీలో బిజినెస్ అసోసియేట్ గా ఉద్యోగం...

Delhi : రెండు చేతులు, కాళ్లు లేవు..అయినా బండి నడుపుతున్నాడు..ఉద్యోగం ఇచ్చిన ఆనంద్ మహీంద్ర

Mahindra

Delhi Man With No Limbs : రెండు చేతులు, కాళ్లు లేవు. అయినా అతను నిరాశ..నిస్పృహ చెందలేదు. బిక్షాటన చేయలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న వాహనాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి నడుపుతున్న ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యాపారంలో ఉంటూనే సోషల్ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్ర కంటపడింది. వెంటనే ఆ వీడియోను చూసి ఓ నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటూనే..వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read More : Spider-Man: స్పైడర్ మ్యాన్.. నోవే హోం.. వరల్డ్ వైడ్ కలెక్షన్లతో బిలియన్ డాలర్లు క్రాస్.. 2021 ఫస్ట్ పాండమిక్ మూవీ ఇదే!

దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు, చేతులు లేవు. అయినా..ప్రత్యేకంగా ఓ ట్రాలీ వాహనం నడుపుతున్నాడు. ఓ వ్యక్తి దీనిని చూసి అతని వివరాలు అడిగాడు. తనకు పెళ్లి అయ్యిందని..ఇద్దరు పిల్లలున్నారని తెలిపాడు. తన కుటుంబంతో పాటు తండ్రి కూడా ఉన్నాడని..కుటుంబాన్ని పోషించే బాధ్యత తనపై ఉందన్నాడు. రెండు కాళ్లు, చేతులు లేవు కనుక.. ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్నట్లు తెలిపాడు. సరుకుల లోడ్ తీసుకుంటూ..నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నట్లు చెప్పాడు.

Read More : Rythu Bandhu : రైతుబంధు 8వ విడత.. రైతుల ఖాతాల్లోకి రూ.7వేల 645 కోట్లు

ఈ వీడియో తన టైమ్ లైన్ కి జత చేశారని వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర టైమ్ ట్వీట్ తెలిపారు. అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నారు. మహీంద్రా కంపెనీలో బిజినెస్ అసోసియేట్ గా ఉద్యోగం ఇస్తున్నట్లు, మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీలో ఎలక్ట్రిక్ లాస్ట్ మైల్ డెలివరీ సర్వీసు ఉద్యోగం ఇస్తున్నట్లు..వెంటనే అతని వివరాలు కనుక్కోవాలని కంపెనీ సిబ్బందిని ఆదేశించారు. ఉద్యోగం ఇచ్చినందుకు నెటిజన్లు మహీంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని మెచ్చుకున్నారు.