బీచ్ లో కనువిందు చేసిన అరుదైన ‘‘తెల్ల తాబేలు’’ పిల్ల

  • Published By: nagamani ,Published On : October 21, 2020 / 03:59 PM IST
బీచ్ లో కనువిందు చేసిన అరుదైన ‘‘తెల్ల తాబేలు’’ పిల్ల

South Carolina beach Rare White Sea Turtle : దక్షిణ కెరొలిన బీచ్ వద్ద వాలంటీర్లుకు అత్యంత అరుదైన తెల్లటి తాబేలు పిల్లను గుర్తించారు. తెల్లగా ఉన్న ఆ పిల్ల ఇసుకలో నడుస్తుండా చూశారు.

కియావా ద్వీపం తాబేలు పెట్రోల్ బీచ్‌లోని సముద్ర తాబేలు గూళ్ళను ఆదివారం (18,2020) వాలంటీర్లు తనిఖీ చేస్తున్నప్పుడు ఇసుకకు అడ్డంగా ఓ తెల్లటి రంగు తాబేలు పిల్ల గునగునా నడుస్తూ కనిపించింది.



టౌన్ ఆఫ్ కియావా ఐలాండ్ ఎస్సీ (Town of Kiawah Island, SC on Sunday) ఈ తెల్లని తాబేలు పిల్ల ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆ తెల్ల సముద్ర తాబేలు పిల్లను చూసి మాకు ఎంతో సంతోషం కలిగిందని తెలిపింది.

జన్యు లోపాల వల్ల తాబేళ్లు ఇలా పుడతాయని నిపుణులు తెలిపారు. జన్యుపరమైన లోపాలు ఉంటే రంగు తగ్గుతుందని అందుకే ఈ తాబేలు పిల్ల అరుదైనదని చెప్పవచ్చని తెలిపారు.


కాగా భారత్ లో ని ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని సుజన్‌పూర్‌ గ్రామంలో బంగారు రంగులో దగదగా మెరిసిపోతూ అరుదైన తాబేలు కనిపించిన విషయం తెలిసిందే. బంగారు రంగులో దగదగా మెరిసిపోతూ చూసేవారిని భలే ఆకట్టుకుంది. బంగారపు రంగులో మెరిసిపోతున్న ఈ పసిడి తాబేలును సడన్‌గా చూస్తే నిజమైన బంగారపు ముద్దలా కనిపిస్తోంది.


ఈ పసిడి తాబేలు గురించి వైల్డ్ లైఫ్ వార్డెన్ భానుమిత్ర మాట్లాడుతూ.. ‘పసుపు రంగులో ఉండే ఈ తాబేలు చాలా అరుదైనదని తెలిపారు. ఇవి చాలా అరుదైన జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో కనిపిస్తుంటాయి. వీటి బరువు 30 కిలోల వరకు ఉంటుంది. సుమారు 50 ఏళ్లు జీవిస్తాయని తెలిపారు.