కరోనా చికిత్సకు గంజాయి, పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు

  • Published By: naveen ,Published On : July 19, 2020 / 11:03 AM IST
కరోనా చికిత్సకు గంజాయి, పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు

ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశం అమెరికా. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడిపోతోంది. భారీ స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి అమెరికా పరిశోధకులు గంజాయి మొక్కపై దృష్టి పెట్టారు. గంజాయి మొక్క ఏమైనా కరోనా ట్రీట్ మెంట్ లో ఉపయోగపడుతుందా అనే కోణంలో పరిశోధనలు జరుపుతున్నారు.

నెబ్రాస్కా, టెక్సాస్ యూనివర్సిటీ బయోమెడికల్ రీసెర్ట్ ఇన్ స్టిట్యూట్ నిపుణులు గంజాయిలో యాంటీ తాపక లక్షణాలను(anti inflammatory properties) గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడే మంటను గంజాయిలోని యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలతో నయం చేయొచ్చని కనుగొన్నారు. కాగా, గంజాయి ద్వారా కరోనాను నయం చేయొచ్చనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు తెలిపారు. ఇది ఓ అంచనా మాత్రమే. కరోనా బారిన పడిన రోగులకు నయం చేయడంలో గంజాయి ఏ విధంగా అయినా సాయపడుతుందా అనే కోణంలో పరిశోధకులు స్టడీ చేస్తున్నారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితుల్లో, వారి శరీరం ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. సైటోకైన్స్ ను పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంది. దాన్ని సైటోకైన్ స్టార్మ్ అంటారు. సైటో కైన్స్ మంట పుట్టడానికి తోడ్పాటు అందిస్తాయి. ఆ మంట ద్వారా ఇన్ ఫెక్షన్స్ ను ఎదుర్కోవచ్చు. అయితే సైటో కైన్స్ ఎక్కువ మోతాదులో విడుదల కావడం మంచిది కాదు. దాని కారణంగానే హై ఫీవర్, మంట, అలసట, వికారం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని పరిస్థితుల్లో అవయవాలు దెబ్బతిని మరణం సంభవిస్తుంది. కాగా, గంజాయిలో ఐఎల్-6 సైటో కైన్ ఇన్సిబిటర్ ఉంటుంది. అది శరీరంలో ఎక్కువ మోతాదులో సైటో కైన్స్ విడుదల కాకుండా అడ్డుకోగలదు” అని నిపుణులు తెలిపారు.

”టోక్లిజుమాబ్ అనే డ్రగ్, ఊపిరితిత్తుల్లో ఉన్న సమ్యలను తొలగించి, రికవర్ కావడానికి తోడ్పడింది. 21మంది కరోనా బాధితుల్లో 91శాతం వరకు ఇలా జరిగింది. అయితే ఈ డ్రగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. క్లోమపు గ్రంథుల్లో మంట పెరుగుతుంది” అని నిపుణులు తెలిపారు. గంజాయి మొక్కలోని కెన్నాబినాయిడ్స్ లో తాపకం తగ్గించే సుగుణాలు ఉన్నాయి. ఈ కారణంగానే కరోనా రోగులకు చికిత్సలో గంజాయి ఉపయోగపడుతుందనే అనే దిశగా పరిశోధనలు జరుపుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు గంజాయిలో చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగానే కరోనా చికిత్సలో స్వల్పంగా వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాదు గంజాయి ద్వారా పేషెంట్స్ లో యాంక్సైటీ తగ్గుతుందని, ఇన్ ఫెక్షన్స్ తో పోరాడే ప్రోటీన్స్ ను పెంచుతుందని గుర్తించారు.