గతేడాది ఆగస్టులోనే చైనాలో కరోనా వైరస్

  • Published By: venkaiahnaidu ,Published On : June 9, 2020 / 11:18 AM IST
గతేడాది ఆగస్టులోనే చైనాలో కరోనా వైరస్

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చైనా దేశంలో గతేడాది ఆగస్టులోనే మొదలైనట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హాస్పిటల్ ట్రావెల్ పార్టనర్స్ శాటిలైట్ ఫొటోలు,సెర్చ్ ఇంజిన్ డేటా ఆధారంగా గతేడాది ఆగస్టులోనే చైనాలో కరోనా వ్యాప్తి జరిగినట్లు తాము గుర్తించామని  హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు తెలిపారు. అయితే చైనా దీనిపై ఘాటుగా స్పందించింది. ఈ రిపోర్ట్ ను హాస్సాస్పదంగా ఉందని చైనా కామెంట్ చేసింది.

వూహాన్‌లో కరోనా వైరస్ 2019 డిసెంబర్ లో మొదటగ వెలుగులోకి చైనా ఇప్పటివరకూ చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైరస్ పుట్టిన వూహాన్‌లో డిసెంబర్ నెల కంటే ముందు నుంచే ప్రజలు దగ్గు, డయేరియా వంటి వాటి గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టినట్టు హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా హాస్పిటల్ ట్రాఫిక్(ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య) కూడా గతేడాది ఆగస్ట్ నుంచే గణనీయంగా పెరిగినట్లు తేలింది.

అయితే కరోనా వైరస్ కారణంగానే ఆసుపత్రుల్లో ట్రాఫిక్ పెరిగిందని ధ్రువీకరించలేమని పరిశోధకులు తెలిపారు. శాటిలైట్ ఫొటోలలో మాత్రం ఆగస్ట్ 2019 నుంచే ఆసుపత్రులలోని కార్ పార్కింగ్‌ స్థలాల ఆక్యుపెన్సీ పెరిగినట్టు తెలిసిందన్నారు. ఆగస్ట్‌లో ప్రజలు డయేరియా గురించి ఎక్కువగా సెర్చ్ చేశారని.. అంతకుముందు ఫ్లూ సీజన్లలో ఇటువంటి డేటా కనిపించలేదని పరిశోధకులు చెప్పారు. 

హార్వార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనపై చైనా అభ్యంతరం తెలిపింది. ట్రాఫిక్ వాల్యూమ్‌ను ఆధారంగా చేసుకుని వైరస్ గతేడాది ఆగస్ట్‌లోనే వ్యాప్తి చెందిందని చెప్పడం హాస్యాస్పదమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్‌ యింగ్ ఫైర్ అయ్యారు.

Read: ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవారిలో కొవిడ్-19 నిరోధకత ఎక్కువ : రీసెర్చర్లు