Afghanistan : ఆఫ్గాన్‌పై పాక్ సైన్యం రాకెట్ దాడి.. ఆరుగురు మృతి.. పాక్‌ను హెచ్చరించిన తాలిబాన్ అధికారులు

ఆఫ్గాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం రాకెట్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఐదుగురు చిన్నారులు..

Afghanistan : ఆఫ్గాన్‌పై పాక్ సైన్యం రాకెట్ దాడి.. ఆరుగురు మృతి.. పాక్‌ను హెచ్చరించిన తాలిబాన్ అధికారులు

Pakistan Vs Afganistan

Afghanistan : ఆఫ్గాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం రాకెట్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఐదుగురు చిన్నారులు, ఓ మహిళతో సహా మొత్తం ఆరుగురు మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రాంతీయ సమాచార డైరెక్టర్ నజీబుల్లా హసన్ అబ్దాల్ పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో తాలిబాన్ అధికారులు పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత సంవత్సరం ఆఫ్గనిస్థాన్ ను తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుండి పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉధ్రిక్తతలు నెలకొన్నాయి. ఆఫ్గన్ ప్రాంతం నుంచి మిలిటెంట్ గ్రూపులు తమ దేశంపై దాడికి యత్నిస్తున్నాయని పాకిస్థాన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.

Afghanistan Girls: వచ్చే వారం నుంచి పాఠశాలలకు వెళ్లనున్న అఫ్గాన్ బాలికలు

ప్రధానంగా పాకిస్థానీ తీవ్రవాదులకు తాలిబాన్లు ఆశ్రయం ఇవ్వడాన్ని పాక్ తప్పబడుతుంది. దీనికితోడు పాకిస్థాన్, ఆప్గాన్ దేశాల మధ్య 2,700 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ అని పిలిచే సరిహద్దు ఉంది. దీనిని ఆక్రమించుకొనేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే ఖోస్ట్ ప్రావిన్స్‌లోని డ్యూరాండ్ లైన్ సమీపంలోని నాలుగు గ్రామాలపై పాకిస్తాన్ హెలికాప్టర్లు బాంబు దాడి చేశాయని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపాడు. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫుటేజీలను ఆప్గాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్ విడుదల చేసింది. ఖోస్ట్‌లో పాకిస్తాన్ వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఆఫ్గనిస్థాన్ ప్రజలు తమ నిరసన తెలిపారు.

Afghanistan: ఆహార సంక్షోభం.. అవయవాలు అమ్ముకుంటున్న అఫ్ఘాన్ తల్లిదండ్రులు

మరోవైపు పాక్ సైన్యం నిబంధనలు ఉల్లంఘనపై ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ కాబూల్‌లోని పాక్ రాయబారిని పిలిపించి ఈ దాడులపై నిరసన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పాకిస్థాన్ ఇంత వరకు స్పందించక పోవటం గమనార్హం. మరోవైపుయునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ (UNAMA) వైమానిక దాడుల వల్ల సంభవించే పౌర మరణాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ వైపు నుండి జరిగిన బాంబు దాడిని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఒక ఆడియో సందేశంలో పేర్కొన్నారు. మేము అటువంటి దాడులు నిరోధించడానికి అన్ని విధాల కృషిచేస్తున్నాము, మా విధానాన్ని గౌరవించాలని పాక్ కు పిలుపునిస్తున్నామని తెలిపారు. యుద్ధం ప్రారంభమైతే అది ఏ పక్షానికి మేలు చేయదని, ఈ విషయాన్ని పాకిస్థాన్ పక్షం తెలుసుకోవాలని సూచించారు.