Elephant: అతిపెద్ద ఎనుగును హతమార్చిన వేటగాళ్లు.. బోట్స్‌వానా ప్రజల ఆగ్రహం.. ఎందుకంటే..

ఆఫ్రికన్ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య రోజురోజుకు అంతరించుకు పోతుంది. బోట్స్‌వానా దేశంలో ఏనుగు జాతి ఎక్కువ. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. దేశంలో దాదాపు 1,30,000 ఏనుగులు ఉన్నాయి.

Elephant: అతిపెద్ద ఎనుగును హతమార్చిన వేటగాళ్లు.. బోట్స్‌వానా ప్రజల ఆగ్రహం.. ఎందుకంటే..

Elephant

Elephant: ఆఫ్రికన్ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య రోజురోజుకు అంతరించుకు పోతుంది. బోట్స్‌వానా దేశంలో ఏనుగు జాతి ఎక్కువ. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. దేశంలో దాదాపు 1,30,000 ఏనుగులు ఉన్నాయి. ఇది ఆఫ్రికాలో మిగిలిన జనాభాలో మూడవ వంతు. ఇటీవలి కాలంలో ఏనుగు దంతాలకోసం వేట ఎక్కువైంది. ఏనుగు దంతాలను సాధారణంగా బొమ్మలు, ఆభరణాలు, ఇతర పరికరాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీనికి చైనాలో అధిక డిమాండ్ ఉంది. మాజీ బోట్స్‌వానా అధ్యక్షుడు ఇయాన్ ఖమా 2014లో దేశంలో వన్యప్రాణులను మెరుగ్గా రక్షించడానికి దేశవ్యాప్తంగా ట్రోఫీ వేట నిషేధాన్ని విధించారు. అయితే ఈ నిషేధాన్ని 2019లో ఖమా వారసుడు మోక్‌వీట్సీ రద్దు చేశారు. దీనికి కారణం లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో పంటలు, ఇతర మౌలిక సదుపాయాలను ఏనుగులు దెబ్బతీయడం స్థానిక ప్రజలకు సమస్యాత్మకంగా మారింది. ముఖ్యంగా పెద్ద ఏనుగులు జనావాస ప్రాంతాలకు చాలా దగ్గరగా వెళితే మానవ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఏనుగుల వేట నిషేధాన్ని బోట్స్ వానా అధ్యక్షుడు ఎత్తివేశాడు.

Elephant viral video : నేనుండగా.. నిన్ను పోనిస్తానా.. తల్లి ప్రేమంటే అట్లుంటది మరి..

ఇటీవల బోట్స్‌వానా ట్రోఫీ వేటగాడు భారీ కాయం కలిగిన ఏనుగును హతమార్చాడు. చంపబడిన అతిపెద్ద ఏనుగును పంటి బరువు దాదాపు 200 పౌండ్లు, దాదాపు 90 కిలోలు ఉంటుంది. ఈ వేట కోసం వేటగాడు సుమారు 40 లక్షల రూపాయలు చెల్లించాడు. ఈ వేట తర్వాత బోట్స్‌వానా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మాజీ అధ్యక్షుడు ఇయాన్ ఖమా కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చనిపోయే ఏనుగుల వల్ల మన టూరిజం ఎలా లాభపడుతుందో ప్రశ్నించారు. అయితే డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. వేటగాడు పేరు లియోన్ కాచెల్‌హోఫర్. 50 వేల డాలర్లు చెల్లించి ఈ ఏనుగును వేటాడారు. ఏనుగుకు దాదాపు 50 ఏళ్లు ఉంటాయి. ఒకే షాట్‌తో చంపబడ్డాయని వేటగాడు ధృవీకరించారు.

Elephant viral video : నేనుండగా.. నిన్ను పోనిస్తానా.. తల్లి ప్రేమంటే అట్లుంటది మరి..

ఇదిలా ఉంటే భారీ కాయంతో అతిపెద్ద వయస్సు కలిగిన ఏనుగును వేటగాళ్లు హతమార్చడం పట్ల మాజీ అధ్యక్షుడు ఇయాన్ ఖమా తన ఫేస్ బుక్ లో ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. వన్యప్రాణులు లేకుంటే పర్యాటకం లేదు, పర్యాటక ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉండవు, ఆదాయ మార్గం ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా వేటగాళ్లు తాను వేటాడిన ప్రదేశాన్ని, చనిపోయిన ఏనుగు ఫొటోను ఫేజ్ బుక్ లో పెట్టుకోవటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దశాబ్దాల ఏనుగును హతమార్చడ పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు.