Greek Businessman : రూ.16 లక్షలను చెత్త బుట్టలో పడేసిన వ్యాపారి!

ఓ వ్యక్తి చెత్త సంచిని పడేయబోయి...రూ. 16 లక్షలున్న డబ్బు సంచిని డస్ట్ బిన్ లో పడేశాడు. తీరా విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి లబోదిబోమంటూ..పీఎస్ మెట్లు ఎక్కాడు.

Greek Businessman : రూ.16 లక్షలను చెత్త బుట్టలో పడేసిన వ్యాపారి!

Greek Businessman

Greek Businessman : తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ తప్పులు సమస్యలను తెచ్చి పెడుతుంది. ఒక పని చేయబోయి..మరొక పని చేస్తుంటారు. వీరివల్ల ఇతరులు ఇబ్బందులు పడుతుంటారు. ఓ వ్యక్తి చెత్త సంచిని పడేయబోయి…రూ. 16 లక్షలున్న డబ్బు సంచిని డస్ట్ బిన్ లో పడేశాడు. తీరా విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి లబోదిబోమంటూ..పీఎస్ మెట్లు ఎక్కాడు. తన డబ్బులు ఇప్పించాలని కోరారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : Oreo Pakode : ఓరియో బిస్కెట్లతో పకోడీ..వీడియో వైరల్

గ్రీక్ దేశంలో ఓ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజు వెళ్లి..షాప్ తెరుచుకుని వ్యాపారం నిర్వహిస్తుంటాడు. వచ్చిన డబ్బును ఇంటికి తీసుకెళ్లి..మరలా తెల్లారి షాప్ కు వస్తుంటాడు. ఓ రోజు..షాప్ తెరవాలని ఉదయాన్నే బయలుదేరాడు. ఓ చేతిలో చెత్త సంచి పట్టుకున్నాడు. మరో చేతిలో రూ. 19 వేల యూరోలు (రూ. 16 లక్షలు)…గల బ్యాగును పట్టుకున్నాడు. మార్గమధ్యంలో…డస్ట్ బిన్ లో సంచి వేసి దుకాణానికి వచ్చాడు. కాసేపటి తర్వాత…డబ్బు సంచి కనబడలేదు.

Read More : Petrol And Diesel : స్థిరంగా చమురు ధరలు, హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోల్ రూ. 108

డస్ట్ బిన్ లో వేసింది డబ్బు సంచి అని గ్రహించాడు. వెంటనే అక్కడకు పరుగెత్తాడు. అక్కడ సంచులు లేకపోవడంతో కంగారు పడిపోయాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. చెత్తను తీసుకెళ్లే వాహనాన్ని ట్రేస్ చేశారు. అందులో కూడా సంచులు కనబడలేదు. అయినా..డబ్బులు కోసం ఆ వ్యాపారి ప్రయత్నించాడు. చివరకు డబ్బు సంచి దొరకడంతో ఊపిరిపీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.