Russia : నాపైనే ఆంక్షలు విధిస్తారా.. ఆస్ట్రేలియా, న్యూజిల్యాడ్ ప్రధానులకు షాకిచ్చిన పుతిన్

యుక్రెయిన్‌ను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునేంత వరకు రష్యా ప్రధాని పుతిన్ శాంతిచేలా కనిపించడం లేదు. పుతిన్ ఆదేశాలతో రష్యా సైన్యం బుచా, కీవ్ నగర వీధుల్లో నరమేధాన్ని సృష్టిస్తుంది. యుక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Russia : నాపైనే ఆంక్షలు విధిస్తారా.. ఆస్ట్రేలియా, న్యూజిల్యాడ్ ప్రధానులకు షాకిచ్చిన పుతిన్

Russia President Putin

Russia : యుక్రెయిన్‌ను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునేంత వరకు రష్యా ప్రధాని పుతిన్ శాంతిచేలా కనిపించడం లేదు. పుతిన్ ఆదేశాలతో రష్యా సైన్యం బుచా, కీవ్ నగర వీధుల్లో నరమేధాన్ని సృష్టిస్తుంది. యుక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాకు ఐరాస షాకిచ్చింది. మానవ హక్కుల సమాఖ్య నుంచి రష్యాను తొలగించింది. ఐరాసలో సభ్యత్వమున్న దేశాల్లో అధికశాతం రష్యాకు వ్యతిరేకంగా ఓటువేయడంతో మానవ హక్కుల సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది.

Russia-Ukraine war: రష్యాకు భారీ షాక్.. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నుంచి తొలగించిన ఐరాస

యుక్రెయిన్ పై రష్యా తీరును ఖండిస్తూ అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ కూడా చేరడంతో పుతిన్ కు కోపాన్ని తెప్పించింది. రష్యాపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు శత్రు చర్యలకు పాల్పడుతున్నాయంటూ రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ఆరోపించింది. దీనికి ప్రతిచర్యగా రెండు దేశాల ప్రధానులను తమ దేశంలోకి ఎంట్రీ లేకుండా బ్యాన్ విధిస్తున్నట్లు పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, న్యూజిలాండ్‌ పీఎం జెసిండా ఆర్డెర్న్‌లు తమ దేశంలోకి అనుమతి లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతేకాక మరో ఆ రెండు దేశాలకు రష్యా మరో హెచ్చకను చేసింది.

russia ukraine war : రష్యాపై ఆంక్షలు కఠినతరం.. టార్గెట్ పుతిన్ డాటర్స్..

ఆ రెండు దేశాల ప్రధానులతో పాటు ఆస్ట్రేలియా మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది, న్యూజిలాండ్ కు చెందిన 130 మందితో కూడిన నిషేధిత జాబితాను రష్యా విడుదల చేసింది. అంతేకాక ఆస్ట్రేలియా, న్యూజీల్యాడ్ దేశాలు హద్దుమీరితే త్వరలోనే ఆ రెండు దేశాలకు చెందిన వ్యాపార వేత్తలు, నిపుణులు, మిలిటరీని కూడా బ్లాక్ లిస్టు లో చేరుస్తామని రష్యా హెచ్చరించింది.