పుతిన్ ని “కిల్లర్”గా అభివర్ణించిన బైడెన్..అమెరికాలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న రష్యా

అమెరికా అధ్యక్షుడు తనను ఓ క్లిల్లర్ గా అభివర్ణించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. బైడెన్ సర్కార్ పై కోపంతో రగిలిపోతున్న పుతిన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తమ దేశ రాయబారి అనాటోలీ ఆంటోనోవ్‌ను రష్యా వెనక్కి పిలిపించింది.

పుతిన్ ని “కిల్లర్”గా అభివర్ణించిన బైడెన్..అమెరికాలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న రష్యా

Russia Recalls Its Us Envoy After Joe Bidens Killer Remark Directed At Vladimir Putin1

Russia recalls అమెరికా అధ్యక్షుడు తనను ఓ క్లిల్లర్ గా అభివర్ణించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. బైడెన్ సర్కార్ పై కోపంతో రగిలిపోతున్న పుతిన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తమ దేశ రాయబారి అనాటోలీ ఆంటోనోవ్‌ను రష్యా వెనక్కి పిలిపించింది. అమెరికాలోని తమ దేశ రాయబారిని వెంటనే తిరిగి మాస్కోకి వచ్చేయాలని రష్యా ఆదేశించింది. ఈ మేరకు రష్యా విదేశాంగశాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలలో కోలుకోలేని క్షీణతను నివారించాలని అందులో పేర్కొంది. అమెరికాతో దౌత్య సంబంధాల విషయంలో ఏమి చేయాలి.. తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వాష్టింగ్టన్‌లోని రష్యా రాయబారి అనాటోలీ ఆంటోనోవ్‌ను పిలిపించాం అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, గతేడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ రష్యా జోక్యం చేసుకుందని, ట్రంప్‌నకు లబ్ధిచేకూర్చి బైడెన్‌ను ఓడించడానికి ప్రయత్నాలు చేసినట్లు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ విభాగం డైరెక్టర్‌ యావ్రిల్‌ హెయిన్స్‌ తాజాగా ఓ రిపోర్ట్ బయటపెట్టారు. ట్రంప్‌కు సన్నిహితులైన అధికారులను వినియోగించుకొని బైడెన్‌పై తప్పుడు ప్రచారం చేయడానికి రష్యా ప్రయత్నించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ దర్యాప్తులో తేలింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌ చట్టసభ సభ్యుడు ఆండ్రీ డెర్కెచ్‌ను ఉపయోగించుకొని ట్రంప్‌ను ప్రభావితం చేసినట్లు గుర్తించింది. అండ్రీ పక్కా రష్యా ఏజెంట్‌ అని నిఘా వర్గాల నివేదికలో వెల్లడించారు. ట్రంప్‌ అటార్ని రూడీ గులియానీని అతను వాడుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేశారని పేర్కొన్నారు. ఇప్పటికే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమికి రష్యానే కారణమని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాంటిది వరుసగా మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బుధవారం జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుధవారం బైడెన్ ఓ ఇంటర్వ్యూలో..రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ, ఇతర ప్రత్యర్థులపై విషప్రయోగానికి ఆదేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుతిన్ ఒక ‘కిల్లర్’ అని భావిస్తున్నారా అని బైడెన్‌ను ప్రశ్నించగా.. అవును నా అభిప్రాయం అదే అని బైడెన్ సమాధానమిచ్చారు. ఇంటెలిజెన్స్ నివేదికపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని దృవీకరిస్తూ ఇంటెలిజెన్స్ నివేదికపై అడిన ప్రశ్నకు బైడెన్ సమాధానమిస్తూ..తన పనులకు పుతిన్ తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. అదేవిధంగా, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావేల్నీని, విష ప్రయోగంతో చంపడానికి కూడా పుతిన్ యత్నించారా అన్న ప్రశ్నకు కూడా…అయి ఉండవచ్చు అని బైడెన్ సమాధానమిచ్చారు. బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాలోని తమ దేశ రాయబారిని రష్యా వెనక్కి పిలిపిస్తోంది. అలాగే మాస్కో లోని తమ రాయబారిని కూడా అమెరికా పిలిపిస్తుందా అన్న విషయం ఇంకా తెలియలేదు.

నావెల్నీపై విష ప్రయోగం కారణంగా రష్యాపై అమెరికా ఆంక్షలు విధించే విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్టు అమెరికా వాణిజ్య శాఖ ఇటీవల ప్రకటించింది. ఇక, బైడెన్ రష్యా పట్ల ఇక కఠినంగా వ్యవహరించనున్నారా అన్న ప్రశ్నకు వైట్ హౌస్ లోని ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి.. ఇందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. నావెల్నీపై విషప్రయోగం, సైబర్ దాడులు, ఆఫ్గనిస్తాన్ లో అమెరికా దళాలపై దాడులు వంటి వాటిని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరోవైపు,రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గెయ్ రయ్‌బకోవ్ మాట్లాడుతూ.. రష్యా-అమెరికన్ సంబంధాలు మరింత క్షీణించే అంశం అమెరికాపై పూర్తిగా ఆధారపడి ఉందని అన్నారు. కాగా, రష్యా అధ్యక్షునిపై గతంలో ట్రంప్ ఒక్కసారిగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. పుతిన్ ని ఆయన దాదాపు తన మిత్రునిగా ప్రకటించుకున్నారు.