Russia ukraine war: ప్రపంచ న్యాయస్థానంలో రష్యాకు వ్యతిరేకంగా ఓటువేసిన భారత జడ్జి..

రష్యా-యుక్రెయిన్ యుద్ధం గురించి అంశం కాస్తా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లింది. ఈక్రమంలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ జడ్జి ఓటు వేశారు.

Russia ukraine war: ప్రపంచ న్యాయస్థానంలో రష్యాకు వ్యతిరేకంగా ఓటువేసిన భారత జడ్జి..

In World Court Indian Judge Votes Against Russia

యుక్రెయిన్ పై రష్యా ఎడ తెగకుండా యుద్ధం చేస్తునే ఉంది. క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. ఓపక్క చర్యలు జరుపుతునే రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రం ఆగటంలేదు. యుక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ అమెరికాతో సహా పలు దేశాలు పదే పదే సూచిస్తున్నాయి. కానీ రష్యా మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. ఈ క్రమంలో రష్యా-యుక్రెయిన్ యుద్ధం గురించి అంశం కాస్తా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లింది. ఉక్రెయిన్ గడ్డపై రష్యా నరమేధానికి పాల్పడుతోంది అంటూ పిటిషన్ దాఖలైంది. పశ్చిమ ఐర్లాండ్ లోని హేగ్ నగరంలోని అంతర్జాతీయ న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది.

Also read : Ukriane Victory : రష్యాపై విజయం సాధించాం-జెలెన్ స్కీ ఆనందం

ఈ సందర్భంగా అమెరికాకు చెందిన జడ్జి జోన్ డోనోగ్ మాట్లాడుతూ..యుక్రెయిన్ పై ఆయుధాలను ప్రయోగించడాన్ని రష్యా తక్షణమే ఆపేయాలని అంతర్జాతీయ ధర్మాసనాన్ని కోరారు. రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను సైతం దెబ్బతీసేలా ఉన్నాయని విన్నవించారు. మరోవైపు యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగిన ఓటింగ్ లో రష్యాకు వ్యతిరేకంగా ఇండియాకు చెందిన జడ్జి జస్టిస్ దల్వీర్ భండారి ఓటు వేశారు. అయితే జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, రష్యా-ఉక్రెయిన్ సమస్యపై ఆయన వివరణ ఆధారంగా స్వతంత్ర చర్య అయినప్పటికీ… వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం యొక్క అధికారిక స్థానం భిన్నంగా ఉందనే విషయం గమనార్హం. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ICJకి నామినేట్ చేయబడింది.

ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్-రష్యా సమస్యపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. యుద్దానికి బదులు చర్చలపై దృష్టి పెట్టి ఇరు దేశాలు సామరస్యంగా చర్చించుకోవాలని అటు రష్యా..ఇటు యుక్రెయిన్ లకు భారత్ సూచించింది.

Also read  Chicken Prices : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు!

కాగా రష్యా అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము యుక్రెయిన్ పై యుద్ధం చేసేది పంతంతో కాదని ఆత్మరక్షణ కోసమేనని స్పష్టంచేసింది. దీన్ని యుక్రెయిన్ ఖండించింది. మా దేశంలో పలు కీలక నగరాలపై మారణ హోమం జరిగిందని వెల్లడించింది. రష్యా తన యుద్ధాన్ని సమర్థించుకోవటానికి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అంటూ యుక్రెయిన్ ఆరోపించింది. దీనిపై రష్యాపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని యుక్రెయిన్ కోరింది. యుద్ధాన్ని ఆపడంలో న్యాయస్థానం పాత్ర ఎంతో ఉందని యుక్రెయిన్ ప్రతినిధి ఆంటోన్ కోరినెవిజ్ అంతర్జాతీయ ధర్మాసనాన్ని కోరారు.

ఈ వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం స్పందిస్తూ..‘ రష్యా యుక్రెయిన్ లో భూభాగంలో మారణహోమం జరిగినట్టు రుజువు చేసే సాక్ష్యాలు తమ వద్ద లేవని వెల్లడించింది. అయినా రష్యా యుక్రెయిన్ లో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అమెరికాకు చెందిన జడ్జి జోన్ డోనోగ్ స్వాగతించారు. కోర్టు ఉత్తర్వులను 13మంది న్యాయమూర్తులు సమర్థించారు. ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం వ్యతిరేకించారు.