Russia Ukraine War : 600మంది సైనికులు మృతి, యుక్రెయిన్‌కు భారీ ఎదురుదెబ్బ..!

యుక్రెయిన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు యుక్రెయిన్ లోని సైనికులు తల దాచుకున్న తాత్కాలిక నివాసాలపై రష్యా రాకెట్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 600మంది సైనికులు మరణించారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.

Russia Ukraine War : 600మంది సైనికులు మృతి, యుక్రెయిన్‌కు భారీ ఎదురుదెబ్బ..!

Russia Ukraine War : యుక్రెయిన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు యుక్రెయిన్ లోని సైనికులు తల దాచుకున్న తాత్కాలిక నివాసాలపై రష్యా రాకెట్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 600మంది సైనికులు మరణించారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.

రష్యా ఆధీనంలో ఉన్న డోనెట్స్క్ ప్రాంతంపై యుక్రెయిన్ దాడుల్లో 89మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకార చర్యగానే తాము క్రామాటోర్క్స్ ప్రాంతంలోని సైనికుల నివాసాలపై దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇదే నిజమైతే గతేడాది ఫిబ్రవరి 24 తర్వాత యుక్రెయిన్ కు ఇదే భారీ ప్రాణనష్టం అవుతుంది. మరోవైపు రష్యా ప్రకటనపై యుక్రెయిన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Also Read..Ukraine-Russia war: ప్రతీకారం తీర్చుకోవడానికి.. అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులను తరలించిన రష్యా

కాగా, రష్యా దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని యుక్రెయిన్ లోని క్రామాటోర్క్స్ మేయర్ అన్నారు. యుక్రెయిన్ దళాలు చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా రష్యా వెల్లడించింది. నూతన సంవత్సరం రోజున రష్యా బలగాలు తలదాచుకున్న చోట యుక్రెయిన్ సేనలు లాంచర్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో 89 మంది రష్యన్ సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే తాజా దాడులు చేసినట్లు రష్యా చెబుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో దాడులకు దిగినట్లు మాస్కో వెల్లడించింది. సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించి కచ్చితమైన సమాచారం రావడంతో రష్యా ఈ దాడులు చేసింది.

ఒకే ఇంట్లో 700 మంది సైనికులు ఉంటే, మరో ఇంట్లో 600 మంది ఉన్నారని రష్యా తెలిపింది. మరోవైపు రష్యా కాల్పుల విరమణపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. పుతిన్ వేసిన ఎత్తుగడలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒకటన్నారు. కాల్పుల విరమణ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ దళాల మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు.

Also Read.. Russia Temporary Ceasefire : యుక్రెయిన్ తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన.. తాత్కాలిక కాల్పుల విమరణ

ఇక రష్యా సైనికులు యుక్రెయిన్ పై యుద్ధంలో ఎంతో యుక్తులు ప్రదర్శిస్తున్నారు. చివరికి విల్లుతో వారు యుక్రెయిన్ సైనికులను వేటాడుతున్నారు. ఓ రష్యా సైనికుడు మెడకు గన్ తగిలించుకుని చేతిలో విల్లు బాణం ఎక్కుపెట్టి శత్రువుల కోసం గాలిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాపై చర్యలు తీసుకునేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. రష్యా దురాఘతాలపై దర్యాఫ్తునకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మద్దతు కోరనున్నాయి. దీని కోసం మార్చిలో నిర్వహించే న్యాయ మంత్రుల సమావేశానికి బ్రిటన్ ఆతిథ్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధ నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను ఎలా పంచుకోవాలో, బాధితులను ఎలా ఆదుకోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. బాంబులు, రాకెట్ల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇరు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు మరణించారు. ఇరు వైపులా ప్రాణనష్టం సంభవించింది. తాను అనుకున్నది సాధించే వరకు యుద్ధం ఆపేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు.