Wagner Group: మాకు వెన్నుపోటు పొడిచారు, వారికి చుక్కలు చూపిస్తాం.. రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపుకు పుతిన్ వార్నింగ్

రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది. రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

Wagner Group: మాకు వెన్నుపోటు పొడిచారు, వారికి చుక్కలు చూపిస్తాం.. రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపుకు పుతిన్ వార్నింగ్

Updated On : June 24, 2023 / 4:52 PM IST

RUSSIA: సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డ వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్‭పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన వారిని ‘విద్రోహులు’గా ముద్రించారు. దేశానికి వెన్నుపోటు పొడిచారని, వారు క్రూరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రష్యా సైనిక నాయకత్వం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా వాగ్నర్ గ్రూప్‌ తిరుగుబాటు ప్రారంభించిన కొద్ది సేపటికే దేశాన్ని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ‘’వాగ్నెర్ సైనికులు, వారి ప్రతినిధులు, స్థానిక చట్టాన్ని అమలు చేస్తున్నవారు, వారికి మద్దతు ఇస్తున్నవారు లొంగిపోండి, మీ భద్రతకు హామీ ఇస్తున్నాను’’ అని పుతిన్ అన్నారు.

Tamilnadu : మొదటి మహిళా బస్సు డ్రైవర్‌ను అభినందించిన ఎంపీ కనిమొళి .. ఉద్యోగం నుంచి తీసివేసిన యాజమాన్యం

రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది. రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ ప్రకటించాయి. (Moscow on high alert) క్రెమ్లిన్ రష్యన్ కిరాయి సైన్యం బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారు. (Wagner takes control of military building in Rostov) మాస్కో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. వాగ్నర్ దళాలు రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనంపై నియంత్రణ సాధించాయి. తన బలగాలు దక్షిణ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించాయని వాగ్నర్ గ్రూప్ చీఫ్ చెప్పడంతో రోస్టోవ్‌లోని రష్యన్ అధికారులు నివాసితులను ఇంట్లోనే ఉండాలని కోరారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా దయచేసి సిటీ సెంటర్‌కు వెళ్లడం మానుకోండి వీలైతే, మీ ఇళ్లను వదిలి వెళ్లవద్దు’’ అని రోస్టోవ్ ప్రాంత గవర్నర్ సలహా ఇచ్చారు.

Secular and Socialist Words: 10వ తరగతి పుస్తకాల్లో సెక్యూలర్, సోషలిస్ట్ పదాలు మాయం.. తెలంగాణ ప్రభుత్వంపై మాయావతి ఆగ్రహం

వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ సంచలన ప్రతిజ్ఞ చేశారు. (Wagner chief vows)రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తానని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టేందుకు సైనికులపై దాడులు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. మొత్తం తన కిరాయి సైన్యం 25వేలమంది ఉన్నారని వారితో కలిసి పోరాడుతున్నామన్నారు. తమ వాగ్నర్ కిరాయి సైనికులు రష్యా దేశ ప్రజల కోసం చావడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. రష్యా సైనిక హెలికాప్టర్‌ను తన బలగాలు కూల్చివేసినట్లు అతను పేర్కొన్నాడు.వాగ్నల్ కిరాయి సైనికుల తిరుగుబాటు తర్వాత రష్యాలో సైనిక వాహనాలను మోహరించారు. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వాగ్నర్ ఫైటర్స్ ప్రిగోజిన్‌ను నిర్బంధించాలని కోరింది.