Russia vs Ukraine War: యుక్రెయిన్‌పై ప‌ట్టుకోసం.. క‌మాండ‌ర్‌ను మార్చిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌..

యుక్రెయిన్ యుద్ధంలో విజ‌యం సాధించేలా మూడు నెల‌ల క్రితం సెర్గీ సురోవికిన్‌ను పుతిన్ క‌మాండ‌ర్‌గా నియ‌మించారు. అయితే, తాజాగా ఆయ‌న్ను తొల‌గించి ఆర్మీలోని సీనియ‌ర్ మోస్ట్ అధికారిని ఆ ప‌ద‌విలో నియ‌మించారు. యుక్రెయిన్‌లో ర‌ష్యా కొత్త క‌మాండ‌ర్ జ‌న‌ర‌ల్ వాలెరీ గెరాసిమోవ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Russia vs Ukraine War: యుక్రెయిన్‌పై ప‌ట్టుకోసం.. క‌మాండ‌ర్‌ను మార్చిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌..

Valery Gerasimov New Commander

Russia vs Ukraine War: ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ర‌ష్యా ద‌ళాల వ్యూహాల‌ను యుక్రెయిన్ సైన్యం, ప్ర‌జ‌లు తిప్పికొడుతున్నారు. ఈ క్ర‌మంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరుదేశాల యుద్ధం కార‌ణంగా ప్రాణాల కోల్పోతున్న‌వారిలో ర‌ష్యా సైనికుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. యుక్రెయిన్‌పై ర‌ష్యా అనేక న‌ష్టాల‌ను చ‌విచూస్తూనే ఉంది. ఇటీవ‌ల ర‌ష్యా చేతుల్లోకి వెళ్లిన న‌గ‌రాల‌ను తిరిగి ఉక్రెయిన్ వేగంగా తిరిగి పొందుతుంది. ఈ నేప‌థ్యంలో యుక్రెయిన్ పై ప‌ట్టు సాధించేందుకు పుతిన్ వ్యూహాం మార్చాడు. ఇందులో భాగంగా త‌న క‌మాండ‌ర్‌ను మార్చేశాడు.

Russia vs Ukraine War: యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా ..

యుక్రెయిన్ యుద్ధంలో విజ‌యం సాధించేలా మూడు నెల‌ల క్రితం సెర్గీ సురోవికిన్‌ను పుతిన్ క‌మాండ‌ర్‌గా నియ‌మించారు. అయితే, తాజాగా ఆయ‌న్ను తొల‌గించి ఆర్మీలోని సీనియ‌ర్ మోస్ట్ అధికారిని ఆ ప‌ద‌విలో నియ‌మించారు. యుక్రెయిన్‌లో ర‌ష్యా కొత్త క‌మాండ‌ర్ జ‌న‌ర‌ల్ వాలెరీ గెరాసిమోవ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సెర్గీ సురోవికిన్ క‌మాండ‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో యుక్రెయిన్ పై పూర్తిస్థాయిలో ర‌ష్యాద‌ళాలు ప‌ట్టు సాధించ‌లేక పోవ‌టంతో పాటు, గ‌తంలో ఆక్ర‌మించిన యుక్రెయిన్ లోని ప్రాంతాల‌నుసైతం కోల్పోతుండ‌టం పుతిన్‌కి ఆగ్ర‌హాన్ని తెప్పించింది. దీంతో అత‌ని స్థానంలో నూత‌న క‌మాండ‌ర్‌ను నియ‌మించిన‌ట్లు తెలుస్తోంది.

Russia vs Ukraine War: వామ్మో అంత భారీ నష్టమా..! యుక్రెయిన్‌‌లో రష్యా సైనికులు ఎంతమంది మరణించారో తెలుసా..?

వాలెరీ గెరాసిమోవ్ 2012 నుంచి ర‌ష్యా జ‌న‌ర‌ల్ స్టాఫ్ గా కొన‌సాగుతున్నారు. ఇక‌నుంచి యుక్రెయిన్ యుద్ధానికి పూర్తి బాధ్య‌త వ‌హిస్తాడు. వాలెరీ క‌మాండ‌ర్‌గా రావ‌డంతో ఉక్రెయిన్‌లో క్షిప‌ణి దాడులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని, దాడులు తీవ్ర‌త‌రం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక యుద్ధం మ‌రోస్థాయికి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని మాస్కోకు చెందిన ఒక నిపుణుడు అల్‌జ‌బీరా వార్తా సంస్థ‌తో చెప్పారు.