మక్కా మసీదులోకి దూసుకెళ్లిన కారు: వీడియో

  • Edited By: nagamani , October 31, 2020 / 01:51 PM IST
మక్కా మసీదులోకి దూసుకెళ్లిన కారు: వీడియో

Saudi Arabia : సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదులోకి వేగంగా వచ్చిన ఓ కారు దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ప్రమాదవశాత్తు మసీదు పరిసరాల్లోకి ప్రవేశించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.25 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.


కారు వేగంగా దూసుకొచ్చి మసీదు ప్రాంగణంలోని ప్లాస్టిక్ బారికేడ్లను దాటుకుంటూ వెళ్లింది. అలా స్పీడ్ గా దూసుకొచ్చిన ఆ కారు కంట్రోల్ తప్పి మసీదు గోడను వేగంగా ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఆ చుట్టు పక్కల ఉన్న ప్రజలంతా పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు.ఎవరన్నా దాడికి యత్నించారేమోనని ఆందోళన చెందారు.కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు మీడియాకు తెలిపారు.దీనిపై సమచారం అందుకున్న స్థానికులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


ఆ కారు నడిపిన వ్యక్తిని సౌదీ అరేబియా పౌరుడిగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.