Saudi Royal Family: ట్రంప్‌కు సౌదీ రాజ కుటుంబం ఇచ్చిన గిఫ్ట్స్ ఫేక్!

సౌదీ రాజ కుటుంబం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని టీమ్‌కి అత్యంత ఖరీదైన చిరుత, పులి వస్త్రాలను బహుమతిగా ఇచ్చింది.

Saudi Royal Family: ట్రంప్‌కు సౌదీ రాజ కుటుంబం ఇచ్చిన గిఫ్ట్స్ ఫేక్!

Saudi

Saudi Royal Family: అతి సంపన్న సౌదీ రాజ కుటుంబం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని టీమ్‌కి అత్యంత ఖరీదైన చిరుత, పులి వస్త్రాలను బహుమతిగా ఇచ్చింది. తెల్లటి పులి, చిరుత బొచ్చుతో తయారు చేసిన మూడు వస్త్రాలు, దంతంగా కనిపించే హ్యాండిల్‌తో తయారైన బాకు బహుమతులుగా సౌదీ రాజు ఇచ్చారు.

అత్యంత ఖరీదైన ఈ గిఫ్ట్‌లను ట్రంప్‌కి 2017లో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు రాజు ఇచ్చారు. అయితే, దీనిపై వైట్ హౌస్ కౌన్సెల్ కార్యాలయం కొన్ని హెచ్చరికలు చేసింది. బొచ్చు నిజంగా పులిదే అయితే, అంతరించిపోతున్న జాతుల చట్టం, 1973 పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని వైట్ హౌస్ ఉల్లంఘించినట్లుగా అవుతుందని చెప్పింది.

అయితే, అసలు ఆ బహుమతులు పులి, చిరుత చర్మంతో చేసినవి కాదని, దుస్తులు నకిలీవని అమెరికా దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడైంది.. నాలుగేళ్ల పాటు వైట్‌హౌస్‌లో రహస్యంగా ఉన్న బహుమతులు నకిలీవిగా తేలడంతో ట్రంప్‌కు, సౌదీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తప్పిపోయిందని చెప్పవచ్చు. అయితే, మూడు బాకుల్లో ఏనుగు దంతంతో తయారైన పిడి కలిగిన ఒక బాకు నిజమైనదేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ విరమణ చివరి రోజున వైట్ హౌస్ ఈ బహుమతులను జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేయగా.. యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీసెస్‌ బహుమతులను స్వాధీనం చేసుకుంది. పులి, చిరుత నమూనాలను అనుకరించేలా ఉన్న కోట్లకు రంగు వేసినట్లు వణ్యప్రాణి ఇన్‌స్పెక్టర్లు, ప్రత్యేక ఏజెంట్ల పరిశోధనలో తేలింది. ఒకవేళ అవి నిజమైతే, 1973 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ట్రంప్‌ ప్రభుత్వం అంతరించిపోతున్న జాతుల చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలు వచ్చేవి.