15,000-Year-Old Viruses : చైనాలో 15వేల ఏళ్ల నాటి వైరస్‌లు గుర్తింపు

చైనాలోని టిబెట్ పర్వత ప్రాంతంలో 15వేళ ఏళ్ల నాటి వైరస్ లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి మంచులో గడ్డకట్టి ఉన్నాయని తెలిపారు.

15,000-Year-Old Viruses : చైనాలో 15వేల ఏళ్ల నాటి వైరస్‌లు గుర్తింపు

15,000 Year Old Viruses

15000-Year-Old Viruses china : చైనాలోని టిబెట్ పర్వత ప్రాంతంలో 15వేళ ఏళ్ల నాటి వైరస్ లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి మంచులో గడ్డకట్టి ఉన్నాయని తెలిపారు. చాలా ఏళ్లు మంచులో ఉండటం వల్ల అవి యాక్టివ్ గా ఉండొచ్చని, వాటిని ల్యాబ్ లో పరీక్షించాల్సి ఉందని చెప్పారు. శాంపిల్స్ సాయంతో ఆ కాలంలోని వైరస్ ల గురించి అధ్యయనం చేయొచ్చని, దీంతో ఇప్పుడున్న పలు వ్యాధులు, వైరస్ ల అంతానికి పరిష్కారం దొరకొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

రెండు మంచు ముక్కల్లో శాస్త్రవేత్తలు వైరస్ లు గుర్తించారు. ఆ కాలం నాటి వైరస్ ల గురించి అధ్యయనం చేసేందుకు సైంటిస్టులు కొత్త పద్దతిని ఎంచుకున్నారు. అదే అల్ట్రా క్లీన్ విధానం. దీని ద్వారా మైక్రోబ్స్, వైరస్ లను విశ్లేషణ చేయొచ్చు. అది కూడా వాటిని కలుషితం చేయకుండానే.

”ఈ హిమానీనదాలు క్రమంగా ఏర్పడ్డాయి. దుమ్ము, వాయువులతో పాటు, అనేక వైరస్ లు కూడా ఆ మంచులో నిక్షేపించబడ్డాయి” అని ఒహియో స్టేట్ యూనివర్సిటీ బైర్డ్ పోలార్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకుడు, ప్రధాన రచయిత జిపింగ్ జాంగ్ చెప్పారు. “పశ్చిమ చైనాలోని హిమానీనదాలు బాగా అధ్యయనం చేయబడలేదు. గత వాతావరణాలను ప్రతిబింబించేలా ఈ సమాచారాన్ని ఉపయోగించడం మా లక్ష్యం. వైరస్ లు ఆ వాతావరణాలలో ఒక భాగం” అని జాంగ్ తెలిపారు.

పశ్చిమ చైనాలోని గులియా ఐస్ క్యాప్ నుండి 2015 లో తీసిన ఐస్ కోర్ లను ఈ బృందం విశ్లేషించింది. ఈ మంచు ఉద్భవించిన గులియా శిఖరం సముద్ర మట్టానికి 22వేల అడుగుల ఎత్తులో ఉంది. వారు మంచును విశ్లేషించినప్పుడు, 33 వైరస్ లకు జన్యు సంకేతాలను కనుగొన్నారు. వాటిలో నాలుగు వైరస్ లను ఇప్పటికే శాస్త్రీయ సమాజం గుర్తించింది. వాటిలో కనీసం 28 నావల్. గడ్డ కట్టిన సమయంలోనూ బతికే ఉన్నాయి.