50,000 year old flute : 50 వేల సంవత్సరాల నాటి ఫ్లూట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు

పురాతన సంగీత పరికరాల గురించి విన్నాం. అయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పరికరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే బోన్ ఫ్లూట్. ఎలుగుబంటి ఎముకలతో నియాండర్తల్‌లు ఈ ఫ్లూట్‌ను తయారు చేశారట. అసలు సంగీత పరికరాలు తయారు చేయడానికి ఆద్యులు కూడా వారేనట. ఈ ఫ్లూట్ విశేషం ఏంటి?

50,000 year old flute : 50 వేల సంవత్సరాల నాటి ఫ్లూట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు

Neanderthal flute

Neanderthal flute : పురాతన కాలంనాటి ఎన్నో సంగీత పరికరాలు గురించి విన్నాం.. చూస్తున్నాం. కానీ ప్రపంచంలోనే అత్యంత పురాతన సంగీత పరికరాన్ని శాస్త్రవేతలు కనుగొన్నారు. స్లోవేనియాలోని డివ్జే బేబ్ గుహలో కనిపించిన సంగీత పరికరం ఏంటంటే?

Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి

పురావస్తు శాస్త్రవేత్తల స్లోవేనియాలోని డివ్జే బేబ్ గుహలో ఎలుగుబంటి ఎముకల నుంచి చెక్కబడిన చారిత్రక సంగీత పరికరాన్ని కనుగొన్నారు. దానిని ఇప్పుడు కూడా ప్లే చేయవచ్చు. దాదాపుగా 50,000 సంవత్సరాల నాటి నియాండర్తల్ ఫ్లూట్‌గా దీనిని చెబుతున్నారు. 1995 లో ఇద్రిజ్కా నదికి సమీపంలోని గుహలో ఇవాన్ టర్క్ అనే శాస్త్రవేత్తల బృందం తవ్వకాలు చేపట్టింది. ఒకప్పుడు నియాండర్తల్‌లు ఉపయోగించిన బోన్ ఫ్లూట్‌ను తవ్వకాల్లో కనుగొన్నారు. వేల సంవత్సరాల నాటిదైనా ఈ సంగీత పరికరం అద్భుతంగా పనిచేస్తోంది. అద్భుతమైన రాగాలు పలికిస్తుంది. ఈ వేణువు స్లోవేనియా నేషనల్ మ్యూజియంలో ఉంచారు.

Anand Mahindra video : క్యారెట్‌ను క్లారినెట్‌గా మార్చేసి సంగీతాన్ని పలికించిన కళాకారుడు.. అద్భుతమంటూ ఆనంద్ మహీంద్రా కితాబు

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఫ్లూట్ ఇది. మూడు దెబ్బ తిన్న రంధ్రాలను సరిచేశారు. ఇప్పటివరకు సంగీత వాయిద్యాలను తయారు చేసిన వారిలో నియాండర్తల్‌లు మొదటివారు. వారు మాత్రమే సంగీతాన్నిసృష్టించారనడానికి ఈ వేణువు ఆధారంగా కనిపిస్తోంది.