Sea Dragon Dolphin: ఇది.. 180 మిలియన్ ఏళ్లనాటి భారీ ‘సీ డ్రాగన్ డాల్ఫిన్’ అస్థిపంజరం

180 మిలియన్ సంవత్సరాల పురాతనమైన ‘సీ డ్రాగన్ డాల్ఫిన్’ అస్థిపంజరాన్ని కనుగొన్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.

Sea Dragon Dolphin: ఇది.. 180 మిలియన్ ఏళ్లనాటి భారీ ‘సీ డ్రాగన్ డాల్ఫిన్’ అస్థిపంజరం

Sea Dragon Dolphin

Sea Dragon Dolphin 180 million years ago discovered : చరిత్రలో కలిసిపోయిన ఎన్నో రహస్యాలను వెలికి తీసే పరిశోధకులు మరో భారీ జీవి అవశేషాలను కనుగొన్నారు. ఇటువంటి జీవులు ఈ భూమ్మీద జీవించాయా? అని ఆశ్చర్యపోయే వింత వింత జీవులకు ఒకప్పుడు ఈ భూమే నెలవుగా ఉండేది. కాలక్రమంలో వచ్చిన మార్పులు భారీ జీవులు అంతరించిపోవటానికి కారణమైనట్లుగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తెలుసుకున్నారు. నిరంతరం తమ పరిశోధనలతో కొత్త కొత్త రహస్యాలను వెలికి తీసే శాస్త్రవేత్తలు 180 మిలియన్ సంవత్సరాల పురాతనమైన ‘సీ డ్రాగన్ డాల్ఫిన్’ అస్థిపంజరాన్ని కనుగొన్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.

Read more : 1,306 Legged Millipede : కళ్లు లేని..1,306 కాళ్లున్న అరుదైన జీవిని గుర్తించిన పరిశోధకులు

మిడ్‌ల్యాండ్ ప్రాంతంలో 180 మిలియన్ సంవత్సరాల పురాతనమైన ‘సీ డ్రాగన్ డాల్ఫిన్’ (ఇచ్థియోసార్) అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఈ సీ డ్రాగన్ డాల్ఫిన్ లాగా 30 అడుగుల పొడవు,పుర్రె బరువు 1 టన్ను (1000 కిలోలు) ఉందని తెలిపారు. ఇటువంటి శిలాజం బ్రిటన్‌లో బయటపడిన అతిపెద్ద మొదటి పూర్తి శిలాజం. జో డేవిస్ అనే పరిశోధకులు ఫిబ్రవరి 2021లో ఈ శిలాజాన్ని కనుగొన్నారు. రట్‌ల్యాండ్ జలాల దగ్గర దొరికిన ఈ డ్రాగన్ దాదాపు 82 అడుగుల వరకు ఉండవచ్చు.

ఇచ్థియోసార్‌లకు పెద్ద పెద్ద దంతాలుంటారు. కళ్లు కూడా పెద్దగా ఉంటాయి.అందుకే వాటిని సముద్రపు డ్రాగన్లు అని పిలుస్తారు. ఇచ్థియోసార్లను మొదటిసారిగా 19వ శతాబ్దంలో మేరీ అన్నింగ్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ సముద్ర జీవిని అధ్యయనం చేసిన డాక్టర్ డీన్ లోమాక్స్ మాట్లాడుతూ..‘బ్రిటన్‌లో అనేక ఇచ్థియోసార్ శిలాజాలు కనుగొనబడ్డాయని కానీ ఇది మాత్రం ప్రత్యేకమైనవి తెలిపారు. ఇది బ్రిటన్‌లో కనుగొనబడిన అతిపెద్ద అస్థిపంజరం కావడం విశేషం అని అన్నారు.

Read more : Dinosaur : చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తించిన పరిశోధకులు..

ఇచ్థియోసార్‌లు 250 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉనికిలోకి వచ్చాయి ..అవి 90 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. అవి చూడటానికి డాల్ఫిన్‌లలా ఉంటాయి. అందుకే డ్రాగన్ డాల్ఫిన్లు అంటారు. ఇచ్థియోసార్‌లు ఇంగ్లండ్‌లో ..అట్లాంటిక్ సముద్రాల జలాల్లో ప్రతిచోటా ఉన్నాయి. ఇటీవల..అమెరికా శాస్త్రవేత్తల బృందం డైనోసార్ల కాలం నుంచి ఇచ్థియోసార్లను కనుగొన్నారు. దాని పొడవు 55 అడుగుల వరకు ఉంది. 240 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ చేపల పరిమాణంలోని సముద్ర జలచరాల పరిమాణం చాలా వేగంగా పెరిగిందని పరిశోధనలో తేలింది. ఈ జీవి తల 6.5 అడుగులు ఉందని తెలిపారు.