Dinosaur : చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తించిన పరిశోధకులు..

ఒకప్పుడు ఈ భూమ్మీద మనుగడ సాగించి అంతరించిపోయిన డైనోసార్ల అవశేషాలు ఈనాటికి బయటపడుతునే ఉన్నాయి. ఈక్రమంలో పరిశోధకులు చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తించారు.

Dinosaur : చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తించిన పరిశోధకులు..

New Type Of Dinosaur Stegouros Elengassen Found

New type of dinosaur Stegouros elengassen found : డైనోసార్లు. ఒకప్పుడు భూమ్మీద నడయాడి అంతరించిపోయిన అత్యంత భారీ ఆకారంలో ఉండే జంతువులు. కోట్లాది సంవత్సరాల క్రిత భూవాతావరణంలో వచ్చిన మార్పులు అంతటి భారీ జీవులు కూడా తట్టుకోలేకపోయాయి. దీంతో డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుతం మనం వాటి శిలాజాలను మాత్రమే చూస్తున్నాం. సినిమాల్లో డైనోసార్లను చూస్తున్నాం. ఇంతటి అతి భారీ సరీసృపాలు భూమిపై సంచరించాయంటే నమ్మేలా ఉండదు. కానీ వాటి గుడ్లు, ఎముకలు వంటివి పలు ప్రాంతాల్లో తవ్వకాల్లో లభ్యమవుతుంటంతో అవి ఈ భూమ్మీద జీవించాయని నమ్మాల్సి వస్తోంది. డైనోసార్లలో అనేక జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు.

ఈక్రమంలో దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో కొత్త రకం డైనోసార్ జాతిని గుర్తించారు పరిశోధకులు. ఈ కొత్త డైనోసార్ కు ‘స్టెగోరస్ ఎలెన్ గాసెన్’ అని నామకరణం చేశారు. ఈ డైనోసార్ చాలా విభిన్నంగా ఉందని చెబుతున్నారు పరిశోధకులు. దీని శరీరంపై గట్టి కవచం ఉందని..దాని తోక చాలా పదునుగా ఉందని దాని తోకతో కొడితే ఎంత భారీ జంతువైన ఖతం అయిపోవాల్సిందే అన్నంత పదునుగా ఉందని తెలిపారు.

Read more : రియల్ జురాసిక్ పార్క్! 90 లక్షల ఏళ్ల నాటి 18వేల డైనోసార్ గుడ్లు..!!

వాటి తోక నిర్మాణాలు ఓ పదునైనా ఆయుధంలా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల డైనోసార్ల అవశేషాలు లభ్యమైనా..ఇటువంటి విభిన్నమైన డైనోసార్ ను గతంలో ఎన్నడూ చూడలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రెండు మీటర్ల పొడవున ఉందని లభ్యమైన శిలాజాల ద్వారా అర్థమవుతోందని తెలిపారు. ఈ శిలాజం 74.9 మిలియన్ల సంవత్సరాల నాటిదని పరిశోధకులు భావిస్తున్నారు.

చిలీలోని దక్షిణ ప్రాంతంలో ఈ వింత డైనోసార్ అవశేషాలు లభ్యమయ్యాయి. దీని పూర్తి శరీర నిర్మాణానికి సంబంధించిన శిలాజాలు అన్నీ లభ్యం కావడంతో దీని పూర్తి ఆకృతిపై పరిశోధకులు స్పష్టమైన అంచనాకు వచ్చారు. ఆంకిలోసారస్ జాతికి చెందిన ఇతర డైనోసార్ల తరహాలోనే దీని తల కూడా సాధారణంగానే ఉండగా, శరీరం, తోక విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు.

Read more : Geetha Gopinath: IMF తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న మహిళ గీతా గోపీనాథ్..

ఈ వింత డైనోసార్ కు సంబంధించిన శిలాజాలు 2018లో లభ్యం కాగా..దాని పూర్తి రూపు రేఖలు..అది ఏ కాలానికి చెందినది? వంటి పలు విషయాలపై ఈనాటికి పరిశోధకులు స్పష్టమైన అవగాహనకు వచ్చారు. శిలాజాలు దొరికిన పెటగోనియా ప్రాంతం ప్రస్తుతం ఎంతో చల్లగా ఉంటుందని..కోట్లాది సంవత్సరాల కిందట అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా స్టెగోరస్ ఎలెన్ గాసెన్ డైనోసార్లు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని పరిశోధకుల బృందం అభిప్రాయానికి వచ్చింది. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో శిలాజరూపం దాల్చిన కొన్ని వృక్ష జాతులను పరిశీలించగా..అవి అమితమైన వేడికి గురైనట్లుగా తెలిసిందన్నారు.

ఈ కొత్త డైనోసార్ కు ‘స్టెగోరస్ ఎలెన్ గాసెన్’ అని నామకరణం చేశారు పరిశోధకులు. ‘స్టెగోరస్’ అంటే గ్రీకు భాషలో “చదునుగా ఉన్న తోక’ అని అర్థం. ఇక ‘ఎలెన్ గాసెన్’ అనే పదాన్ని స్థానిక జానపదాల నుంచి తీసుకున్నారు పరిశోధకులు. . భీకరంగా ఉండే జంతువుల్ని ‘ఎలెన్ గాసెన్’ అంటారట.

స్టెగోరస్ ఎలెన్ గాసెన్ కు శరీరంపైనే ఎముకలు పైకి పొడుచుకుని వచ్చినట్టుగా పెరిగాయని..దాని వల్లే దీని తోకకు ఓ ప్రత్యేకత ఏర్పడిందని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన సెర్జియో సోటో అకునా అనే శాస్త్రవేత్త వెల్లడించారు. స్టెగోరస్ డైనోసార్ తోకను చూస్తే రాటిల్ స్నేక్ తోక, బల్లి తోకలా అనిపిస్తోందని తెలిపారు. భారీ ఆర్మడిల్లో జంతువుల్లోనూ ఇటువంటి నిర్మాణాలే ఉండేవని..కానీ వాతావరణంలో వచ్చిన మార్పులకు అవి కూడా అంతరించిపోయాయని తెలిపారు.