Geetha Gopinath: IMF తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న మహిళ గీతా గోపీనాథ్..

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు భారతీయ మూలాలున్న గీతా గోపీనాథ్.

Geetha Gopinath: IMF తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న మహిళ గీతా గోపీనాథ్..

Geethagopinath Imf deputy Md

Geethagopinath IMF Deputy MD : భారతీయులు ఎక్కడున్నా తమ ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..! అన్ని చోట్ల రాజ్యధికారం మనదే..! ప్రపంచ టెక్ సామ్రాజ్యానికి అధిపతులందరూ భారతీయులే..! మన మేథోశ‌క్తిసామ‌ర్థ్యాల‌ను ఎవరికీ తిసిపోనివి అని చాటిచెబుతున్నారు భారతీయులు. ఈ క్రమంలో భారతీయ మూలాలున్న ఓ మహిళ గీతా గోపీనాథ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది మరోసారి భారతీయుల ప్రతిభను చాటారు. IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గీతా గోపీనాథ్ పదోన్నతి పొందారని గురువారం (డిసెంబర్ 2,2021) IMF ప్రకటించింది.

IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా ఆధ్వర్యంలో పనిచేస్తున్న జియోఫ్రీ ఒకామోటో తర్వాత గోపీనాథ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. జాఫ్రీ ఒకామోటో వచ్చే ఏడాది ప్రారంభంలో తన పదవి నుండి వైదొలగనున్నారు. దీని తర్వాత గీతా గోపీనాథ్ ఈ పదవిని చేపట్టనున్నారు. జియోఫ్రీ ఒకామోటో 2022లో పదివి నుంచి తప్పుకోనున్నారు. ఆ స్థానంలో గీతా గోపీనాథ్ జనవరి 2022,21 పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఎంఎఫ్‎లో నెంబర్ 2గా కొనసాగనున్నారు.

Read more : Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!

దీనిపై IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతు..‘‘నేను 2022 జనవరిలో IMF నుండి నిష్క్రమించబోతున్నాను..చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్‌ను కొత్త FDMDగా ప్రతిపాదిస్తున్నాను” అని ట్వీట్‌లో తెలిపారు. నేను ప్రపంచంలోని ప్రముఖ స్థూల ఆర్థికవేత్తలలో ఒకరైన GeetaGopinath కోసం ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నారు.

ఈ సంస్థ నాయకత్వ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించటానికి గోపీనాథ్‌ “సరైన వారు” అని భావిస్తాను అని జార్జివా ఈ సందర్భంగా అన్నారు కరోనాతో ఎన్నో దేశాలు ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సవాళ్ల స్థాయి..పరిధిని పెంచడానికి గీత చేసిన కృషి ప్రపంవ్యాప్తంగా గుర్తించారని నేను నమ్ముతున్నానని అన్నారు. ఆమె ఫండ్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది అని అన్నారు జార్జివా.

IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా తనకు లభించిన ఈ అవకాశాన్ని నేను గౌరవంగా భావిస్తున్నానని గీతా గోపీనాథ్ అన్నారు. గత మూడు సంవత్సరాలలో..కఠినమైన ఆర్థిక విశ్లేషణ..పబ్లిక్ పాలసీలలో IMF చేసిన అత్యంత ముఖ్యమైన పనిని ప్రత్యక్షంగా చూశాను. ఆర్థిక వ్యవస్థలపై, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజల జీవితాలపై మా పని సానుకూల ప్రభావాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.క్రిస్టాలినా, బోర్డ్‌కి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని గీతా గోపినాథ్ అన్నారు.

Read more : Fighter jet tyre Theft : ఏకంగా..యుద్ధ విమానం టైర్‌ను దొంగిలించిన దుండగులు

భారత్ తో గీతా గోపీనాథ్ కు ప్రత్యేక సంబంధం
గీతా గోపీనాథ్ 1971 డిసెంబర్ 8న భారతదేశంలోని కలకత్తాలో మలయాళీ కుటుంబంలో జన్మించారు. 1992లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి ఆర్థికశాస్త్రంలో ఆనర్స్ చేసారు. తరువాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేసారు. తరువాత..1994లో వాషింగ్టన్ యూనివర్శిటీలో 1996 నుండి 2001 వరకు ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసారు.