Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!

గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు.. అంతా మనోళ్లే..! అన్ని చోట్ల రాజ్యధికారం మనదే..! ప్రపంచ టెక్ సామ్రాజ్యానికి అధిపతులందరూ భారతీయులే..! మన మేథోశ‌క్తిసామ‌ర్థ్యాల‌ను ఎవరికీ తిసిపోనివి..!

Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!

All the heads of the technology : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు.. అంతా మనోళ్లే..! అన్ని చోట్ల రాజ్యధికారం మనదే..! ప్రపంచ టెక్ సామ్రాజ్యానికి అధిపతులందరూ భారతీయులే..! మన మేథోశ‌క్తిసామ‌ర్థ్యాల‌ను ఎవరికీ తిసిపోనివి..! ఇండియన్‌ టాలెంట్‌ వెలకట్టలేనిది..! మెరికల్లాంటి ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌ని దిగుమతి చేసుకుంటున్న ప్రపంచదేశాలు.. ముఖ్యంగా అందులో అమెరికా ప్రతిభకు పట్టం కడుతోంది. సాంకేతిక విద్యలో అమెరికాకు ఉజ్వలమైన భవిష్యత్తుని అందించడమే కాకుండా ప్రతిభ కలిగిన భారతీయులను అందలమెక్కిస్తోంది. ప్రపంచంలోనే అత్యున్నతమైన టెక్‌ కంపెనీల సీఈవోలంతా భారతీయులే ఉండడం..ఇండియన్‌ టాలెంట్‌ను మరోసారి ప్రపంచానికి కళ్లకు గట్టినట్లు చూపించింది. తన మేథోశక్తితో ప్రపంచాన్ని ఏలుతున్న ఎలన్ మస్క్‌ లాంటి వాళ్లు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. భారతీయుల ప్రతిభ అమెరికాకు ఎంతో గొప్పగా ఉపయోగపడుతుందన్నారు.

భారతీయుల మేధస్సు అనంతం. ఆలోచనే ప్రగతికి, ప్రతిభకు మూలం. అనేక సవాళ్లను అధిగమిస్తూ అనునిత్యం కొత్తదనంతో ముందుకు దూసుకుపోవడమే ఆశయంగా విదేశాల్లో భారతీయుల జీవనం సాగిపోతోంది. దాని ఫలితంగానే ఏడాదికోకరు టెక్‌ కంపెనీల సీఈవోలుగా నియమితులవుతున్నారు. సత్య నాదెళ్ల, శాంతను నారాయణ్, సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, ఇప్పుడు పరాగ్ అగర్వాల్.. ఇలా భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలకు సీఈవోగాలు రాణిస్తూ.. దేశ ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. ప్రపంచానికే తమ జ్ఞానాన్ని అందిస్తూ.. తమదైన ముద్ర వేస్తున్నారు.

Realtor Murder : హైదరాబాద్‌లో రియల్టర్‌ హత్య

సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్‌ అగర్వాల్‌ ఈ అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. పరాగ్‌ అగర్వాల్‌ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో 2011లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌, యాహూలలో రీసెర్చి చేశారు. 2011లో ట్విటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన పరాగ్‌ అగర్వాల్‌.. 2018లో ట్విట్టర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. పదేళ్లుగా ట్విట్టర్‌లో పనిచేస్తున్న ఆయన.. 37ఏళ్లకే ట్విట్టర్‌ సీఈవోగా ఎదగడమంటే మాముల విషయం కాదు..! 500 ఎస్ అండ్ పి కంపెనీల్లో అతి తక్కువ వయసులోనే ఓ కంపెనీ సీఈవోగా ఆయన ఎదిగిన తీరు భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.

సత్యనారాయణ నాదెళ్ల.. అలియాస్ సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సీఈవోగా సత్య నాదెళ్ల నిలిచారు.

Road Accident : పాదచారులను మెరుపువేగంతో ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

సుందర్ పిచాయ్.. భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన లెజెండ్. తన అకుంఠిత శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. సౌతిండియా నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌, స్మార్ట్ ఫోన్స్ గతిని మార్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ లాంటి సక్సెస్‌లు సుందర్ ప్రస్థానంలో ఉన్నాయి. అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్.. 2015 లో గూగుల్ సీఈఓగా ఎన్నికయ్యారు. ఇక 2019లో గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా బాధ్యతలు స్వీకరించారు.

1962లో భారత్‌లో జన్మించిన అరవింద్ కృష్ణ.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి కలిగిన IBMకు బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2020 నుంచి ఆయన సీఈవోగా ఉన్నారు. జనవరి 2021లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1990లో ఐబీఎంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అరవింద్ కృష్ణ.. IBM క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్, ఐబిఎం రీసెర్చ్ విభాగాలను నిర్వహిస్తూ.. 2015లో సీనియర్ వైస్ ప్రెసెడెంట్‌గా పదోన్నతి పొందారు. కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు అయిన రెడ్ హ్యాట్ కొనుగోలులో ఆయన పాత్ర కీలకం.

VRO Suicide : కాల్ మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య

భారతీయ అమెరికన్ వ్యాపార వేత్తగా శంతను నారాయణ్ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడోబ్ కంపెనీకి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. స్వస్థలం హైదరాబాద్. ఆయన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌లోనే చదువుకున్నారు. 1998లో అడోబ్‌లో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా చేరారు. ఆ తరువాత 2005లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2007లో సీఈవో, 2017లో బోర్డు ఛైర్మన్ అయ్యారు.

ఇక గూగుల్‌ నుంచి మొదలైన నికేశ్ అరోరా ప్రస్థానం పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ సీఈవో వరకు కొనసాగింది. ఇలా అనేక టెక్‌ కంపెనీలకు భారతీయులు అధిపతులుగా ఎదుగుతున్న తీరు ప్రపంచాన్నే విస్మయ పరుస్తోంది. తెలివితేటలతో పాటు నిబద్దత, క్రమశిక్షణ, కష్టపడే తత్వమే వారి గెలుపు రహస్యంగా టేక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.