రియల్ జురాసిక్ పార్క్! 90 లక్షల ఏళ్ల నాటి 18వేల డైనోసార్ గుడ్లు..!!

  • Published By: nagamani ,Published On : September 19, 2020 / 10:33 AM IST
రియల్ జురాసిక్ పార్క్! 90 లక్షల ఏళ్ల నాటి 18వేల డైనోసార్ గుడ్లు..!!

జురాసిక్ పార్క్ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరినీ అలరించిన అద్భుతమైన సినిమా. డైనోసార్స్ (రాకాసి బల్లుల) కథనంతో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. భూమిపై రాకాసిబల్లులు అంతరించిపోయినా ఎక్కడోక చోట వాటి అవశేషాలు కనిపిస్తునే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో డైనోసార్ల ఎముకలు..గోర్లు, దంతాలు, గుడ్ల అవశేషాలు బైటపడుతూనే ఉన్నాయి.


ఈ క్రమంలో డ్రాగన్‌ దేశం చైనాలోని గువాంగ్‌డాంగ్ రాష్ట్రంలోని హేయువాన్ ప్రాంతంలో జీవశాస్త్రవేత్తలు తవ్వకాల్లో అత్యంత భారీగా డైనోసార్ల గుడ్లు బైటపడ్డాయి. ఒకటీ రెండూ కాదు..10, 20 కాదు..వందల సంఖ్యలో కూడా కాదు ఏకంగా వేల సంఖ్యలో డైనోసార్ల గుడ్లు బైటపడ్డాయి.
హేయువాన్ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ డైనోసార్ల ఎముకలు బైటపడ్డాయి.



https://10tv.in/this-bicycle-priced-rs-3-7-lakh-has-just-been-launched-in-india/
తవ్వే కొద్దీ డైనోసార్ల గుడ్లే గుడ్లు డైటపడుతున్నాయి. ఏకంగా 18వేల రాకాసి బల్లులు గుడ్లు! కోళ్ల ఫారమ్‌లోలాగా వందలు, వేల గుడ్లు ఉత్పత్తి అయినట్లుగా హేయువాన్ ప్రాంతలో డైనోసార్ గుడ్లు బయటపడుతున్నాయి. వేల ఏళ్ల కిందట అక్కడ ఏకంగా డైనోసార్ల ఫారమే నడిచినట్లుగా ఉంది.


తాజా పరిశోధకులు జరిపిన తవ్వకాల్లో 90 లక్షల ఏళ్ల నాటి గుడ్లు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయని వారు తెలిపారు. డైనోసార్ల గుడ్లు బైటపడేకొద్దీ పరిశోధకులు మరింత ఉత్సాహంగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు.ఇలా ఇప్పటి వరకూ 18 వేల గుడ్లు లభ్యమయ్యాయి. దీంతో ప్రపంచంలో అత్యధికంగా రాకాసిబల్లుల గుడ్లు దొరికిన ప్రాంతంగా హేయువాన్ రికార్డులకెక్కింది. ఈ 18వేల గుడ్లల్లో 33 గుడ్లు అప్పుడే పెట్టినంత భద్రంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.


మట్టిలో కూరుకుపోవడంతో ఇవి పగిలిపోకుండా శిలాజాలుగా మారినట్లు జీవశాస్త్రవేత్తలు తెలిపారు. గత సంవతసరం ఓ స్కూలు విద్యార్థి ఏకంగా 10 డైనోసార్ల గుడ్లను ఇదే ప్రాంతంలో వెలికి తీశాడు. దీంతో జీవశాస్త్రవేత్తల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. దీంతో తవ్వకాలు జరపగా ఈ రియల్ జురాసిక్ పార్క్ బైటపడింది. దీంతో హేయువాన్ ప్రాంత స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..‘ఇది జారాసిక్ పార్క్‌ను తలపించే ప్రాంతం. ఇక్కడ ఆ కాలంలో రాకాసి బల్లులు తిరిగాయంటే మాకు నమ్మకం కలగదు. చాలా అద్భుతంగా ఉంది. చాలా థ్రిల్లింగ్ గా ఉందని తెగ ఆనందపడిపోతున్నారు.