Seema- Sachin Love Story : సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ట్విస్ట్… పాక్ దోపిడీ దొంగ హెచ్చరిక

పాకిస్థాన్ మహిళ సీమా హైదర్- భారత యువకుడు సచిన్ మీనాల ప్రేమ కథలో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. ఈ వినూత్న ప్రేమకథలోకి పాక్ దేశానికి చెందిన ఓ కరడుకట్టిన దోపిడీ దొంగ ప్రవేశించారు....

Seema- Sachin Love Story : సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ట్విస్ట్… పాక్ దోపిడీ దొంగ హెచ్చరిక

Seema-Sachin Love Story

Seema- Sachin Love Story : పాకిస్థాన్ మహిళ సీమా హైదర్- భారత యువకుడు సచిన్ మీనాల ప్రేమ కథలో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. ఈ వినూత్న ప్రేమకథలోకి పాక్ దేశానికి చెందిన ఓ కరడుకట్టిన దోపిడీ దొంగ ప్రవేశించారు. తమ దేశానికి చెందిన సీమా హైదర్‌ను తిరిగి పంపించకుంటే తాను దాడి చేస్తానని పాకిస్థాన్(Pakistan) దేశంలోని కచ్ ప్రాంతానికి చెందిన దోపిడీ దొంగ రానోషార్ తాజాగా హెచ్చరించాడు.

Pakistani woman Seema Haider : హిందూమతం స్వీకరించాను, పాక్‌కు తిరిగి వెళ్లను… సీమాహైదర్ వెల్లడి

భర్తను వదిలి తన నలుగురు పిల్లలతో కలిసి ప్రేమికుడి కోసం భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ ‘వీర్-జారా’ తరహా ప్రేమకథ భారతదేశంలో అందరి హృదయాలను గెలుచుకుంది. కానీ వీరి ప్రేమకథతో పాక్ దోపిడీ దొంగ కలత చెందాడు. సీమా హైదర్ నుదుట కుంకుమబొట్టు పెట్టుకొని, చీర కట్టుకొని మాంసాహారాన్ని మానివేసి హిందూ దేవుళ్లకు పూజలు చేస్తున్న వీడియోలను టీవీలో చూసిన గజదొంగ రానో షార్ పాకిస్థాన్‌లోని హిందువులను బెదిరించాడు.

Cobra Snake Enters Bathroom : బాత్రూంలో పడగవిప్పిన నాగు పాము ప్రత్యక్షం

సీమాను తిరిగి పాక్ దేశానికి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వాన్ని దోపిడీ దొంగ అభ్యర్థించాడు. సీమా తమ దేశానికి తిరిగి వచ్చే వరకూ తాను కచ్‌లోని రోఖారీ దర్బార్ ఆలయంలోకి భక్తులను అనుమతించబోనని బెదిరించాడు. దొంగలకు నిలయంగా ఉన్నకచ్ ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ దోపిడీ దొంగ అయిన రానోషార్ తాజాగా వీడియోను విడుదల చేశారు. కాగా బలూచిస్థాన్‌లోని ఝక్రానీ తెగకు చెందిన పాకిస్తానీ పురుషుల బృందం కూడా ఇటీవల సీమా హైదర్‌ను పాకిస్తాన్‌కు తిరిగి పంపాలని డిమాండ్ చేసింది.

Pak dacoit threatened

Pak dacoit threatened