COVID-19: ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్.. బిక్కుబిక్కుమంటున్న చైనా ప్రజలు

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో లాక్‌డౌన్ అమలవుతోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

COVID-19: ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్.. బిక్కుబిక్కుమంటున్న చైనా ప్రజలు

Covid 19

COVID-19: చైనాలో కొంతకాలంగా కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అదుపులోకి రావడం లేదు. దీంతో మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. తాజాగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో లాక్‌డౌన్ అమలవుతోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోనే ఉండటంతో చాలామందికి ఆహారం, మంచి నీళ్లు కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఈ నిబంధనలు ఇంకా కఠినంగా అమలు చేస్తున్నారు.

Covid-19: స్టూడెంట్స్ లంచ్ షేర్ చేసుకోవద్దు: ఢిల్లీ ప్రభుత్వం

ఇప్పటికే అనేక ప్రాంతాలను బారికేడ్లతో మూసివేసిన అధికారులు, ఇప్పుడు కరోనా సోకిన వారి ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రెండు మీటర్ల ఎత్తు ఉన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమను అవమానించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువుల్ని బంధించి, చుట్టూ ఫెన్సింగ్ వేసినట్లుగా తమ ఇండ్లకు ఫెన్సింగ్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాంఘై నగరంలో దాదాపు రెండున్నర కోట్ల మంది పౌరులు నివసిస్తున్నారు. వీళ్లంతా ప్రభుత్వ చర్యలతో ఇబ్బంది పడుతున్నారు.