హాయిగా నిద్రపోండి : ప్రపంచ నిద్ర దినోత్సవం

మార్చి 15 ప్రపంచ ‘నిద్ర’ దినోత్సవం.. దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ విదేశాలలో తప్పకుండా పాటిస్తారు. నిద్ర అనే అంశంపై పలు చర్చలు నిర్వహిస్తుంటారు.

హాయిగా నిద్రపోండి : ప్రపంచ నిద్ర దినోత్సవం

ప్రతీ సంవత్సరం మార్చి మూడవ శుక్రవారం ఈ నిద్రా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 15 ప్రపంచ ‘నిద్ర’ దినోత్సవం.. దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ విదేశాలలో తప్పకుండా పాటిస్తారు. నిద్ర అనే అంశంపై పలు చర్చలు నిర్వహిస్తుంటారు.

‘నిద్ర’ దినోత్సవం.. దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ విదేశాలలో తప్పకుండా పాటిస్తారు. నిద్ర అనే అంశంపై పలు చర్చలు నిర్వహిస్తుంటారు. నిద్ర శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రశాంత స్థితి. ఇది మానవులకే కాక జంతువులు..పక్షులు, ఇలా ప్రతీ ప్రాణికి నిద్ర చాలా అవసరం. ప్రతీప్రాణి బ్రతకటానికి నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా మానవుల జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని..శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని..నిద్ర ప్రతీ పౌరుని ప్రాథమిక హక్కని.ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.
Read Also: మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..

2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల ఫలితంగా 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు. నిద్ర విస్తృతమైన పరిశోధనలు కూడా జరుగు తున్నాయి. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతోపాటు ఆస్తులు, అంతస్తులు, సతీ, సుతుల్ అందరూ ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 45% మంది నిద్రాదేవి ఆదరణను నోచుకోవడం లేదని 2016లో ఓ సర్వేలో వెల్లడయ్యింది. ‘నిద్రలేమి’ అనేది పెద్ద సమస్యగా తయారయ్యింది.

ప్రాంత, వర్ణ, జాతి, వయోభేదాలు అనే  లేకుండా ప్రపంచాన్నంతా పీడిస్తున్న ఏకైక వ్యాధి నిద్రలేమి. మనోవ్యధలూ..శారీరక బాధలు ఇలా అన్ని నిద్రాదేవి ఒడిలోనే సేదతీరేది. ప్రశాంతమైన నిద్ర దివ్యావౌషధమమంటారు నిపుణులు. హాయిగా నిద్రపోయినవారు ఆరోగ్యంగా ఉంటారని కూడా పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ విషయాన్ని ప్రపంచ నిద్రా ఔషధ సమాజంవారు ప్రకటించారు.
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

నిద్ర వల్ల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు..మానవుని శరీరం సూపర్ కంప్యూటర్ లాంటిదని నిపుణులు చెబుతుంటారు. నిద్రలో శరీరం ఆరోజులు జరిగిన చిన్న చిన్న ఇబ్బందులను రిపేర్ చేసుకుంటుంది.సంపూర్ణ నిద్రలోనే మెదడు భావోద్వేగాలూ సమతుల్యతను సాధిస్తాయి.కండరాల పెరుగుదల, జీవకణాల మరమ్మత్తు, హార్మోన్ల విడుదల వంటివన్నీ నిద్రావస్థలోనే జరుగుతాయి. ఇలా నిద్రవల్ల కలిగే ప్రయోజనాలకు చెప్పుకోవాలంటే మరో నిద్రా దినోత్సవం వచ్చేంతవరకూ ఉంటాయి. మరి ఈ నిద్ర దినోత్సవం రోజులన అందరు హాయిగా నిద్రపోవాలని కోరుకుంటూ.. హ్యావ్ ఏ నైస్ స్లీప్  డే.