వారి కోసమే : స్మోకింగ్ మాన్పించే మొబైల్ యాప్ 

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 10:02 AM IST
వారి కోసమే : స్మోకింగ్ మాన్పించే మొబైల్ యాప్ 

న్యూయార్క్‌ : ధూమ పానం చాలా చాలా ప్రమాదకమైనది. అది స్మోకింగ్ చేసేవారికే కాదు చుట్టు ప్రక్కలవారికి కూడా చాలా ప్రమాదం. ధూమ పానం వద్దని హెచ్చరించే యాడ్స్ చాలానే చూస్తుంటాం. దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై ఎన్నో అవగామన కార్యక్రమలను కూడా చూస్తున్నాం. ఈ వ్యసనం అంతకంతకు పెరుగుతోంది. కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన వేళ చాలా మంది పొగరాయుళ్లు సిగరెట్ తాగడం మానేయాలని తీర్మానం చేసుకుంటారు. ఆ బలహీనతను మానలేకపోతుంటారు. దీంతో పలు వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ వస్తుందని డాక్టర్స్ హెచ్చరించినా మానలేని ధూమ పాన ప్రియుల కోసం వచ్చేసిందో యాప్..అదే ‘గెరో హెల్త్‌స్పాన్‌’.

ధూమపానం అలవాటును మాన్పించడంతోపాటు, దాని వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలను పసిగట్టి మనకు చెప్పే సరికొత్త మొబైల్‌ యాప్‌ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. ‘గెరో హెల్త్‌స్పాన్‌’ అనే ఈ యాప్‌ సాయంతో.. పొగ తాగడం వల్ల శరీరంలో జరిగే మార్పులను ఏ రోజుకారోజు తెలుసుకోవచ్చని వారు తెలిపారు. అంతే కాకుండా రోజువారి ఫలితాలను బట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందో, ఆ అలవాటు ఎలా మానుకోవాలో ఈ గెరో హెల్త్‌స్పాన్‌ చెబుతుందని దాన్ని తయారు చేసిన రోస్‌వెల్‌ పార్క్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. మరి పొగరాయుళ్లు ఇకనైనా ధూమ పానం మాని ఇటు కుటుంబానికి..అటు సమాజానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి