Viral Video: రోడ్డు ఒక వైపు మంచు తోడి మరోవైపు వాహనదారులపై పోసిన ప్రబుద్ధుడు

మతి భ్రమించిందో లేక మద్యం మత్తులో ఉన్నాడో తెలియదుగానీ.. ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి 40 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోడ్డుకి ఒక వైపు మంచును తోడి.. మరో వైపు నడి రోడ్డుపై ఐస్ పడేలా

Viral Video: రోడ్డు ఒక వైపు మంచు తోడి మరోవైపు వాహనదారులపై పోసిన ప్రబుద్ధుడు

Snow Plowing

Viral Video: మతి భ్రమించిందో లేక మద్యం మత్తులో ఉన్నాడో తెలియదుగానీ.. ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి 40 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈఘటన అమెరికాలోని ఒహాయో నగరంలో ఇటీవల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒహాయో నగరంలోని హైవేపై..విపరీతంగా మంచు కురిసింది. మోకాలు లోతున ఉన్న మంచును తోడేందుకు అక్కడి హైవే యాజమాన్యం ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి డ్రైవర్ ను నియమించింది. అయితే ఆ డ్రైవర్ రోడ్డుకి ఒక వైపు మంచును తోడి.. మరో వైపు నడి రోడ్డుపై ఐస్ (గడ్డకట్టిన మంచు) పడేలా ట్రక్ తో దున్నుతున్నాడు. బురదతో కూడిన మంచు నేరుగా..రహదారి మధ్యలో పడడంతో వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు.

Also read: Upasana Ramcharan:”ఉపాసనా రామ్ చరణ్” పై నెటిజన్లు ఆగ్రహం

వేగంగా వచ్చిన వాహనాలు ఒక్కసారిగా ఐస్ మీదకు రావడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన కాలువల్లోకి దూసుకువెళ్లాయి. మొత్తం 40 వాహనాలు ప్రమాదానికి గురికాగా.. 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇక ఈఘటనపై మంచుతోడే కాంట్రాక్టు సంస్థ “Turnpike and Infrastructure Commission” స్పందిస్తూ.. ప్రమాదనికి కారణమైన ఆ డ్రైవర్ ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మద్యం, డ్రగ్స్ సహా మానసిక స్థితి పై పరీక్షలు జరపనున్నారు.

Also read: Warangal Crime: నర్సంపేటలో వైన్ షాపు యజమాని కిడ్నాప్ కలకలం

బహుశా అతను కావాలనే ఈ పని చేసి ఉంటాడని(Deliberate Act).. పోలీసులు ప్రాధమిక నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన వాహనదారుల వైద్య ఖర్చును, వాహనాలకు సంబందించిన రిపేర్ బిల్లును తామే చెల్లిస్తామంటూ కాంట్రాక్టు సంస్థ ప్రకటించింది. ఇక ఈ ఘటనకు సంబందించిన వీడియోలను స్థానిక రిపోర్టర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇలా చేయడం వలన ఆ డ్రైవర్ కు ఒరిగిందేమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Also read: Girl Tortured: 14 ఏళ్ల బాలికను నిర్బంధించి మూడు రోజులుగా యువకుడు చిత్రహింసలు