Upasana Ramcharan:”ఉపాసనా రామ్ చరణ్” పై నెటిజన్లు ఆగ్రహం

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో ఇరుక్కున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనా పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Upasana Ramcharan:”ఉపాసనా రామ్ చరణ్” పై నెటిజన్లు ఆగ్రహం

Upasana

Updated On : January 27, 2022 / 3:42 PM IST

Upasana Ramcharan: మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో ఇరుక్కున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనా పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసనాపై ఫేస్ బుక్ వేదికగా ఘాటు విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ప్రత్యక్ష సామాజిక సేవలోనూ, సోషల్ మీడియా ద్వారా పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఉపాసనాపై నెటిజన్లు అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసనా ఒక గుడి గోపురం ఫోటోను తన ఫేస్ బుక్ పేజిలో పంచుకున్నారు ఉపాసనా.

Also Read: Warangal Crime: నర్సంపేటలో వైన్ షాపు యజమాని కిడ్నాప్ కలకలం

పెద్ద గుడి గోపురంపై దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజలు నిలుచున్నట్లుగా ఫోటో ఎడిట్ చేశారు. గుడిగోపురం పై సూక్ష్మ రూపంలో కొందరు ప్రజలు నిలుచుని ఉన్న ఆ ఫొటోలో “తానూ, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామని, ఎక్కడ ఉన్నామో కొనుక్కోండి” అంటూ ఉపాసనా తన ఫాలోయర్స్ ని కోరారు. ఆ ఫోటో తనకు ఎంతగానో నచ్చిందని.. అలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరో తనకు నేరుగా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసనా రాసుకొచ్చారు.

Also read: Girl Tortured: 14 ఏళ్ల బాలికను నిర్బంధించి మూడు రోజులుగా యువకుడు చిత్రహింసలు

ఇక ఉపాసనా షేర్ చేసిన ఫోటోకు నెటిజన్ల నుంచి ఊహించని రిప్లైలు వస్తున్నాయి. మీరు ఎంత గొప్పవారైన కావొచ్చు కానీ ఇలా దేవుడి గోపురాన్ని అడ్డు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం తగదంటూ హితవు పలుకుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. “ఫోటోని అలా తీర్చి దిద్దిన ఆర్టిస్ట్ ను మెచ్చుకోవడం కంటే.. అసలు వేల సంవత్సరాల క్రితం ఆ గోపురాన్ని నిర్మించిన కళాకారులను స్మరించుకోండి అంటూ” ఒకరు కామెంట్ చేస్తే.. గణతంత్ర దినోత్సవం నాడు మీరు ఇచ్చిన సందేశం ఏంటి.. ఆఫొటోని షేర్ చేసి భారతీయులకు ఈ అవమానం ఎందుకు” అంటూ మరొకరు కామెంట్ చేశారు. వెంటనే పోస్ట్ ను డిలీట్ చేయాలంటూ నెటిజన్లు, మెగా అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

Also read: Selfie Danger: సెల్ఫీ మోజులో కరెంట్ షాక్ కు గురైన యువకుడు