అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం..సారీ చెప్పిన అమెరికా రాయబారి

  • Published By: madhu ,Published On : June 4, 2020 / 06:04 AM IST
అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం..సారీ చెప్పిన అమెరికా రాయబారి

అగ్రాజ్యంగా పిలవబడే..అమెరికాలో జాతిపిత మహాత్మ గాంధీకి ఘోర అవమానం జరిగింది. వాషింగ్టన్ డీసీ ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఘటనను ఖండిస్తున్నారు. కేవలం విగ్రహంపై జరిగిన దాడి కాదని..భారతీయ సమాజానికి అవమానమని రాయబార కార్యాలయం వెల్లడించింది. వెంటనే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది. విగ్రహాన్ని కవర్ తో కప్పి ఉంచారు.

గాంధీ విగ్రహ ధ్వంసాన్ని అమెరికా ఖండించింది. ఇందుకు క్షమాపణలు చెబుతున్నట్లు అమెరికా ప్రకటించింది. తమ క్షమాపణలు అంగీకరించాలంటూ అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ ట్వీట్ చేశారు. గాంధి విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించండి..వెరీ సారీ అన్నారు. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఆందోళనల్లో  గాంధీ విగ్రహం ధ్వంసం అయిందని, ఎలాంటి జాతి వివక్షలను సహించదని, జార్జ్ ఫ్లాయిడ్ మృతి తనను కలిచివేసిందన్నారు. అల్లర్లు, భయంకరమైన హింస, గాంధీ విధ్వంసంతో చాలా భయపడ్డానన్నారు. ఈ ఆందఓళన నుంచి త్వరగానే కోలుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహ ధ్వంసం ఘటనపై వాషింగ్టన్ పార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

’ఐ కాంట్‌ బ్రీత్‌’  ఉద్యమం అమెరికాను ఇప్పుడు నిద్రపోనివ్వడం లేదు. లక్షలమంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చేందుకు కారణమైంది. న్యూయార్క్‌ నగరంలో స్టేటన్‌ ఐలాండ్‌ బేస్ట్రీట్‌ వద్ద ఎరిక్‌ గార్నర్‌ అనే నల్లజాతీయుడిని నేలపై పడేసి చేతులు వెనక్కు విరిచి కట్టేసేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించబోయిన అతడిని ఒక ఆఫీసర్‌ జూడోలోని చాక్‌హోల్డ్‌ పొజిషన్‌లో గొంతు పట్టుకున్నాడు. దీంతో ఎరిక్‌ విలవిలలాడిపోయాడు. ఐ కాంట్ బ్రీత్ అంటూ వేడుకున్నాడు. 11 సార్లు వేడుకున్నా పోలీసులు వినలేదు.

దీంతో అతడు స్పృహ తప్పిపోయాడు. అంబులెన్స్‌లోనూ ఆక్సిజన్‌ అందించలేదనే ఆరోపణలున్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈసారి జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసులకు బలైపోయాడు. ఫోర్జరీ పత్రాలు వినియోగిస్తున్నాడనే అనుమానంతో మినియాపోలీస్‌ అధికారులు అతడిని కారులోంచి బయటకు లాగి రోడ్డుపై పడేసి మెడపై మోకాలితో తొక్కిపట్టారు. ప్రతిఘటించకపోయినా నల్లజాతీయుడనే కారణంతో దారుణంగా వ్యవహరించారు. ఈ వివాదానికి ట్రంప్‌ తన ట్వీట్‌తో ఆజ్యం పోశారు. నిరసనకారుల్ని దుండగులుగా అభివర్ణించడంతో మరింత రగిలిపోయారు. దాని ఫలితమే ఆందోళనలు వైట్‌హౌస్‌ను తాకాయి.

అమెరికాలో ఆఫ్రికన్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అల్లర్లు దేశ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు తాకాయి. దీంతో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పరిస్థితి శృతిమించుతుండడంతో ట్రంప్‌ ఫ్యామిలీని కూడా బంకర్‌కు షిఫ్ట్ చేశారు. మరోవైపు హింసాకాండ మరిన్ని రాష్ర్టాలు, నగరాలకు విస్తరించింది.

Read:పంజరంలో చిలుకలు ఎగిరిపోయాయని 8 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపేశారు