సింహం ఎముకలకు భారీ డిమాండ్

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 06:24 AM IST
సింహం ఎముకలకు భారీ డిమాండ్

అక్రమంగా తరలిస్తున్న వందల కిలోల సింహాల ఎముక‌ల‌ను సౌతాఫ్రికా పోలీసులు సీజ్ చేశారు. జోహాన్న‌స్‌బ‌ర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో 342 కిలోల సింహం ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. 
ఆసియా దేశాల్లో మృగ‌రాజుల‌ ఎముక‌ల‌కు భారీ డిమాండ్ ఉంది. సింహం ఎముకలను మందుల త‌యారీలోను..న‌గ‌ల త‌యారీలోనూ వినియోగిస్తారు. దీంతో అక్కడ సింహం ఎముకలకు మంచి డిమాండ్ ఉండటంతో వాటిని భారీగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.  ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. 

ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చిన ఓ షిప్‌మెంట్‌ను అధికారులు ప‌రీక్షించారు. దాంట్లో 12 అల్యూమియం బాక్సుల్లో సింహాల ఎముక‌లు ఉన్న‌ట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  సౌతాఫ్రికాలో 11 వేల సింహాలు ఉన్నాయి. దాంట్లో కేవ‌లం 3 వేలు మాత్ర‌మే నేషనల్  పార్కుల్లో ఉంటున్నాయి. మిగిలినవి అడవుల్లో నివసిస్తున్నాయి. 

ఆ దేశంలో సింహం ఎముకలు తరలించేందుకు చట్టబద్దమైనదే. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే తరలించటం చట్ట విరుద్ధం. ఈ క్రమంలో అనుమతులు తీసుకోకుండా తరలిస్తున్న సింహం ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారు జింబాబ్వే దేశస్థులతో సహా ఇతర దేశాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు.