Sri Lanka: చైనా నిర్మిస్తోన్న‌ కొలంబో పోర్ట్ సిటీలో 40 ఏళ్ల పాటు ప‌న్ను మిన‌హాయింపు

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. చైనా నిర్మిస్తోన్న‌ కొలంబో పోర్ట్ సిటీలో ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు పెట్టేవారు 40 ఏళ్ల పాటు ప‌న్నులు క‌ట్టే అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించింది.

Sri Lanka: చైనా నిర్మిస్తోన్న‌ కొలంబో పోర్ట్ సిటీలో 40 ఏళ్ల పాటు ప‌న్ను మిన‌హాయింపు

Colombo Port City

Sri Lanka: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. చైనా నిర్మిస్తోన్న‌ కొలంబో పోర్ట్ సిటీలో ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు పెట్టేవారు 40 ఏళ్ల పాటు ప‌న్నులు క‌ట్టే అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించింది. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు రాబ‌ట్ట‌డంలో విఫ‌ల‌మైన శ్రీ‌లంక కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇత‌ర దేశాలు కూడా వారి విదేశీ ప్ర‌త్యేక్ష‌ పెట్టుబ‌డుల కోసం ప‌న్ను ఉప‌శ‌మ‌నానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకున్నాయ‌ని, శ్రీ‌లంక‌లో కంటే ఆయా దేశాల్లో స‌ర‌ళ‌త‌ర‌ ప‌న్ను విధానాలు కొన‌సాగుతున్నాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

alien: మ‌న పాల‌పుంత‌లో 4 ప్ర‌మాద‌క‌ర ఏలియ‌న్ నాగ‌రిక‌త‌లు!

ప‌న్నుల‌ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తూ తాము తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల విదేశాల నుంచి మ‌రిన్ని పెట్టుబ‌డులు వ‌స్తే శ్రీ‌లంక‌లోని డాల‌ర్ సంక్షోభం త‌గ్గుతుంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం త‌మ దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల వ‌ల్ల పెట్టుబ‌డిదారులు త‌మ దేశాన్ని కాద‌ని బంగ్లాదేశ్‌, ఇథియోపియా, కెన్యా వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నార‌ని శ్రీ‌లంక ప్ర‌భుత్వం తెలిపింది. 38 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు రాబ‌ట్ట‌మే ల‌క్ష్యంతా తాము 100 హెక్టార్ల భూమిని విక్ర‌యించ‌డానికి ప్ర‌ణాళిక వేసుకున్నామ‌ని పోర్ట్ సిటీ అధికారులు చెప్పారు.