alien: మ‌న పాల‌పుంత‌లో 4 ప్ర‌మాద‌క‌ర ఏలియ‌న్ నాగ‌రిక‌త‌లు!

గ్ర‌హాంత‌ర వాసుల గురించి ఎన్నో సిద్ధాంతాలు, ఊహాగానాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే, గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నార‌న్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఆధారాల‌తో నిర్ధారించ‌లేదు.

alien: మ‌న పాల‌పుంత‌లో 4 ప్ర‌మాద‌క‌ర ఏలియ‌న్ నాగ‌రిక‌త‌లు!

Alien

alien: గ్ర‌హాంత‌ర వాసుల గురించి ఎన్నో సిద్ధాంతాలు, ఊహాగానాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే, గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నార‌న్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఆధారాల‌తో నిర్ధారించ‌లేదు. ఈ విశాల విశ్వంలో మాన‌వుడిని మించిన తెలివితేట‌లు ఏ జీవికీ లేవు. అయితే, ఒక‌వేళ ఏలియ‌న్స్‌కు మ‌న‌కంటే ఎక్కువ తెలివి ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతుంటారు. గ్ర‌హాంతర వాసుల ఉనికిని ప‌సిగట్టేందుకు సంబంధించిన ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. గ‌ణిత స‌మీక‌ర‌ణాల ఆధారంగానూ ఏలియ‌న్స్ గురించి ప‌రిశోధ‌కులు ప‌లు అంశాలను చెబుతుంటారు. తాజాగా, ఇటువంటి విశ్లేష‌ణ ఆధారంగా స్పానిష్ ప‌రిశోధ‌కుడు అల్బెర్టో క్యాబ‌లెరో ప‌లు కొత్త విష‌యాలు తెలిపారు.

NEET PG 2021: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?: సుప్రీంకోర్టు

మ‌న పాల‌పుంత‌లోనే నాలుగు ర‌కాల ప్ర‌మాద‌క‌ర ఏలియ‌న్ నాగ‌రిక‌త‌లు ఉన్నాయ‌ని ఆయ‌న అంటున్నారు. అవి భూమిపై దాడి చేసే అవకాశమూ ఉందని చెబుతున్నారు. అయితే, ఆయన వెల్ల‌డించిన ఆయా విష‌యాలకు సంబంధించిన ప‌త్రాలు ఇంకా శాస్త్ర‌వేత్త‌ల స‌మీక్ష‌కు వెళ్ల‌లేదు. అయితే, గ‌తంలో ”ఏలియ‌న్ జీవితం” అంటూ కేంబ్రిడ్జి వ‌ర్సిటీకి ఆయ‌న‌ రాసి పంపిన‌ ఓ విశ్లేష‌నాత్మ‌క క‌థ‌నాన్ని మాత్రం ఆస్ట్రోబ‌యాల‌జీ అనే అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్ స‌మీక్షించి, ప్ర‌చురించింది. స్పెయిన్‌లోని వీగో విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తోన్న అల్బెర్టో క్యాబ‌లెరో తాజాగా ఏలియ‌న్ల గురించి చెప్పిన వివ‌రాల ప్రకారం… మ‌న‌పాల‌పుంత‌లోనే అధునిక సాంకేతిక ద్వారా ప‌ర‌స్ప‌రం దాడి చేసుకునే ఏలియ‌న్ నాగ‌రిక‌తలు ఉన్నాయి.

Russia: ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌లో బ్యాంకులు ప్రారంభిస్తోన్న ర‌ష్యా

చ‌రిత్ర‌లో ఓ ప్రాంతానికి చెందిన‌ మాన‌వులు మ‌రో ప్రాంతానికి చెందిన వారితో ఎలా దాడులు జ‌రిపేవారన్న డేటాను విశ్లేషించి ఏలియ‌న్ల నాగ‌రిక‌త గురించి అల్బెర్టో క్యాబ‌లెరో ఈ అంచ‌నా వేశారు. మనకు తెలిసిన మానవ జీవితం ఆధారంగానే తాను ఏలియన్ల గురించి ఈ విశ్లేషణ చేశానని ఆయన అన్నారు. తెలివైన ఏలియన్లు ఉన్నాయా? అన్న విషయంపై మనకు ఇప్పటివరకు స్పష్టమైన వివరాలు తెలియలేదని తెలిపారు. అయితే, ఈ ఏలియ‌న్ జాతులు చేసే దాడిక‌న్నా గ్ర‌హ‌శ‌క‌లాల వ‌ల్లే భూమి ధ్వంసమ‌య్యే ముప్పు అధికంగా ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.