NEET PG 2021: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?: సుప్రీంకోర్టు

జాతీయ అర్హ‌త, ప్ర‌వేశ పరీక్ష (నీట్-2021) పీజీ సీట్ల భర్తీ వ్యవహారంలో భార‌త‌ వైద్య మండలి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆల్ ఇండియా కోటాలో మెడికల్ కాలేజీల్లో 1,456 సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

NEET PG 2021: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?: సుప్రీంకోర్టు

Supreme Court

NEET PG 2021: జాతీయ అర్హ‌త, ప్ర‌వేశ పరీక్ష (నీట్-2021) పీజీ సీట్ల భర్తీ వ్యవహారంలో భార‌త‌ వైద్య మండలి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆల్ ఇండియా కోటాలో మెడికల్ కాలేజీల్లో 1,456 సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పీజీ సీట్ల భర్తీ విషయంపై భారత వైద్య మండలి, కేంద్ర ప్రభుత్వానికి ప‌లు ప్రశ్నలు సంధించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా? అని సుప్రీంకోర్టు నిల‌దీసింది. సీట్లను ఖాళీగా ఉంచకూడద‌ని చెప్పింది.

Russia: ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌లో బ్యాంకులు ప్రారంభిస్తోన్న ర‌ష్యా

సీట్లు పూర్తిగా భ‌ర్తీ కాక‌పోతే మాప్‌ఆప్‌ రౌండ్ కౌన్సెలింగ్ ఎందుకు నిర్వ‌హించ‌లేద‌ని ప్ర‌శ్నించింది. కౌన్సెలింగ్ నిర్వ‌హించిన అనంత‌రం సీట్లు ఖాళీగా ఉన్నాయని మే నెలలోనే తెలిసినప్పుడు ‘మాప్అప్ రౌండ్’ ఎందుకు నిర్వ‌హించాలి క‌దా? అని నిల‌దీసింది. వైద్యుల అవసరం ఉన్న‌ప్పుడు ఇలా సీట్లను ఖాళీగా ఉంచడం ఏంట‌ని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పీజీ సీట్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఎందుకు భర్తీ చేయలేదు? అన్న వివ‌రాలు తెలుపుతూ ఈరోజే అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ గురువారం చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.