Sri Lanka : రష్యా – యుక్రెయిన్ యుద్ధం, లీటర్ పెట్రోల్ రూ. 204!

ధరలపై నియంత్రణ విధిస్తూ.. అత్యవసర నిబంధనలు ముందుకు తెచ్చింది. ప్రస్తుతం రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం... చమురు సంస్థలపై ఎఫెక్ట్ చూపిస్తోంది.

Sri Lanka : రష్యా – యుక్రెయిన్ యుద్ధం, లీటర్ పెట్రోల్ రూ. 204!

Petrol

Sri Lanka IOC : యుక్రెయిన్ రాజధాని కీవ్ మిస్సైల్‌ దాడులతో అట్టుడుకుతోంది. యుక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. కీవ్‌ టార్గెట్‌గా రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. సామాన్యులపై మిస్సైల్‌ వర్షం కురిపిస్తోంది. కీవ్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లపై మిస్సైల్‌ దాడి చేసింది. దీంతో అపార్ట్‌మెంట్‌లోని ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ప్రధానంగా చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More : Russia-Ukraine Conflict : ప్రధాని మోదీకి యుక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్.. రష్యా దురాక్రమణ ఆపాలని విజ్ఞప్తి!

దీంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. చమరు నిల్వలపై దృష్టి సారిస్తున్నాయి. అయితే..శ్రీలంకలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఇంకా ఆహారం, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని విమర్శలు ఉన్నాయి. కరోనా కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయి. విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకోవాలని దిగుమతులపై నిషేధం విధించింది. ధరలపై నియంత్రణ విధిస్తూ.. అత్యవసర నిబంధనలు ముందుకు తెచ్చింది. ప్రస్తుతం రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం… చమురు సంస్థలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి.

Read More : Ukraine Kyiv Curfew : యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో కర్ఫ్యూ.. రోడ్లపైకి ఎవరూ రావొద్దంటూ హెచ్చరిక!

శ్రీలంకలో పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లీటర్ పెట్రోల్ కు రూ. 20, లీటర్ డీజిల్ రూ. 15 పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. పెరిగిన ధరలతో ఇప్పుడు శ్రీలంకలో లీటర్ పెట్రోల్ రూ. 204, లీటర్ డీజిల్ ధర రూ. 139కి ఎగబాకింది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడంతో చమురు కొనుగోళ్లు జరగలేదని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఫలితంగా… పెట్రోల్ పంపులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో శ్రీలంక వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.