Indian fishermen arest : 54 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక

మత్సకారులు తమ భూభాగంలో చేపల వేట చేశారని ఆరోపిస్తూ.. శ్రీలంక నావికాదళం 54 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది.. వారినుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన తెలిపింది.

Indian fishermen arest : 54 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక

Arest

మత్సకారులు తమ భూభాగంలో చేపల వేట చేశారని ఆరోపిస్తూ.. శ్రీలంక నావికాదళం 54 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది.. వారినుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన తెలిపింది. బుధవారం ఉత్తర, ఈశాన్య ప్రాంతాల తీరంలో మత్స్యకారులను అరెస్టు చేసింది నేవీ. శ్రీలంక జలాల్లో విదేశీ మత్స్యకారుల ప్రభావం ఉంటుంది. వారిలో తమిళనాడుకు చెందిన వారు ఎక్కువగా ఉంటుంటారు.. దాంతో శ్రీలంక మత్స్య సంపదను కాపాడుకోవడానికి.. అక్రమంగా చేపలు పట్టే కార్యకలాపాలను అరికట్టడానికి నేవీ క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది..

ఈ క్రమంలో జాఫ్నాలోని కోవిలాన్ తీరానికి 3 నాటికల్ మైళ్ళ దూరంలో 14 మంది సిబ్బందితో భారతీయ ఫిషింగ్ నౌకలను నావికాదళం పట్టుకుంది. ట్రాలింగ్‌లో పాల్గొన్న 20 మంది సిబ్బంది సహా రెండు భారతీయ మత్స్యకార నౌకలను స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో మొత్తం 54 మంది ఉన్నట్టు తెలిపింది. ఇదిలావుంటే ఈ ఏడాది జనవరిలో, శ్రీలంక నావికాదళం తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేయడంతోపాటు ఒక యాంత్రిక పడవను స్వాధీనం చేసుకుంది.