Wickremesinghe: మా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం 2024 వ‌ర‌కు కొన‌సాగొచ్చు: శ్రీ‌లంక ప్ర‌ధాని

Wickremesinghe: మా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం 2024 వ‌ర‌కు కొన‌సాగొచ్చు: శ్రీ‌లంక ప్ర‌ధాని

Sri Lanka Pm Ranil Wickremesinghe

Wickremesinghe: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక విదేశీ సాయం కోసం ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న‌ ర‌ష్యాపై పాశ్చాత దేశాలు ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే అమెరికా స‌హా పాశ్చాత దేశాలు ముడి చ‌మురు వంటి వాటి దిగుమ‌తుల‌ను నిలిపేశాయి. అయిన‌ప్ప‌టికీ, శ్రీ‌లంక‌లో సంక్షోభం కార‌ణంగా ర‌ష్యా నుంచి ముడి చ‌మురు కొంటామ‌ని శ్రీ‌లంక తెలిపింది. తాజాగా శ్రీ‌లంక ప్ర‌ధాని రణిల్‌ విక్రమ సింఘే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌మ దేశంలోని ప‌రిస్థితుల గురించి చెప్పారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ర‌ష్యా నుంచి ముడిచ‌మురును దిగుమ‌తి చేసుకోవ‌డ‌మే కాకుండా, చైనా నుంచి తాము మ‌రింత రుణం తీసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం ప్ర‌భావం కార‌ణంగా శ్రీ‌లంక‌లో ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయ‌ని చెప్పారు. త‌మ దేశంలో నెల‌కొన్న తీవ్ర ఆహార సంక్షోభం 2024 వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. శ్రీ‌లంక‌కు ర‌ష్యా గోధుమ‌లు పంపుతామ‌ని చెప్పింద‌ని వివ‌రించారు. శ్రీ‌లంక‌కు పెద్ద ఎత్తున ఇంధ‌నం అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

presidential elections: ‘15న ఢిల్లీకి రండి’ అంటూ సోనియా, కేసీఆర్ స‌హా 22 మందికి మ‌మ‌త లేఖ‌లు

మధ్యప్రాచ్యం నుంచి క్రూడాయిల్, బొగ్గును దిగుమ‌తి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. మధ్యప్రాచ్యం నుంచి వాటిని దిగుమ‌తి చేసుకునే అవ‌కాశం త‌మ‌కు లేకపోతే, ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ తిరిగి ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకోవాల‌ని భావిస్తున్నామ‌ని తెలిపారు. ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఏయే ప్రాజెక్టులు చేప‌ట్టాల‌నే విష‌యంపై దృష్టిసారిస్తామ‌ని, వాటి కోసం రుణాలు తీసుకుంటామ‌ని చెప్పారు. చైనా నుంచి లేదా ఇత‌ర దేశాల నుంచి రుణాలు తీసుకుంటామ‌ని అన్నారు.