Mahinda Rajapaksa : ఆర్థిక సంక్షోభంలో లంక.. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా తప్పదా?

Mahinda Rajapaksa : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స సోమవారం (మే 9) రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడైన ప్రధాని మహింద రాజపక్సే విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

Mahinda Rajapaksa : ఆర్థిక సంక్షోభంలో లంక.. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా తప్పదా?

Sri Lankan Prime Minister Mahinda Rajapaksa Likely To Resign This Week, Local Media Says

Mahinda Rajapaksa : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స సోమవారం (మే 9) రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడైన ప్రధాని మహింద రాజపక్సే విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు మహింద సానుకూలంగా స్పందించారు. ప్రజల వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ఒక మెట్టు దిగేందుకు రాజపక్స అంగీకరించినట్లు తెలుస్తోంది. జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే గొటబాయ ప్రతిపాదనలను విపక్షాలు అంగీకరించలేదు. లంకలో ఎమర్జెన్సీ విధించినప్పటికీ ప్రజల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. లంక పార్లమెంట్‌ను ముట్టడించేందుకు పెద్దఎత్తున విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో మే17 వరకు పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

కీలక పదవుల్లో గొటబాయ కుటుంబ సభ్యులు అధికారాన్ని చెలాయిస్తుండడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గద్దె దిగాల్సందేనని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) మహింద రాజీనామా చేయొచ్చన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. ఈనెల 6వ తేదీన కేబినెట్‌ ప్రత్యేకంగా భేటీ అయింది. ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల ఆగ్రహం తగ్గాలంటే మహింద రాజపక్సే పదవినుంచి తప్పుకోవాలని ఒత్తిడి పెరగడంతో మహింద అంగీకరించారని తెలుస్తోంది. ఇవాళ ఆయన ప్రధాని పదవినుంచి తప్పుకుంటారని లంక స్థానిక పత్రికల్లో కథనాలు వచ్చాయి. జూన్‌లో కొత్త మంత్రివర్గాన్ని పునర్యవస్థీకరించాలని అధ్యక్షుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Sri Lankan Prime Minister Mahinda Rajapaksa Likely To Resign This Week, Local Media Says (1)

Sri Lankan Prime Minister Mahinda Rajapaksa Likely To Resign This Week, Local Media Says 

లంకలో ఒకవైపు.. క‌రోనా సంక్షోభం.. మ‌రోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో లంక మ‌ళ్లీ డ్రాగ‌న్‌ చెంతకు చేరుతోంది. అత్యవ‌స‌ర మ‌ద్దతు కోసం 100 మిలియ‌న్ డాల‌ర్ల సాయం కోరింది. శ్రీ‌లంక‌కు చైనా మ‌ద్దతుతో ప‌ని చేస్తున్న ఏషియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సాయం చేయ‌నుంది. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులకు విదేశీ మార‌క ద్రవ్య నిధుల ల‌భ్యత కోసం సాయం చేయాల‌ని శ్రీ‌లంక కోరినట్లు ఏషియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ తెలిపింది. గ‌త ప‌దేళ్లుగా శ్రీ‌లంక‌కు రుణాలు ఇస్తున్న చైనా… ఇప్పటివ‌ర‌కు శ్రీ‌లంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణ సాయం చేసింది. చైనాకు లంక 6.5 బిలియ‌న్ డాల‌ర్లు బ‌కాయి ప‌డింది.

Read Also : Srilanka Crisis : శ్రీలంక కష్టాలు తీరే అవకాశం..ఆదుకోవటానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు