Stomach Pain: కడుపునొప్పి అనుకుని బాత్రూంకి వెళితే..బిడ్డకు జన్మనిచ్చిన యువతి..

కడుపునొప్పి వస్తుందని టాయ్‌లెట్‌కు వెళ్లిన యువతి అనుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యునైటెడ్ కింగ్ డమ్ లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న జెస్ డేవిస్ అనే 20ఏళ్ల యువతి ఆశ్చర్యకరంగా డెలివరీ అయింది. పీరియడ్ సరిగా రాకపోవడంతోనే కడుపునొప్పి వస్తుందని భావిస్తుంటే ఇలా జరిగిందని వివరించింది.

Stomach Pain: కడుపునొప్పి అనుకుని బాత్రూంకి వెళితే..బిడ్డకు జన్మనిచ్చిన యువతి..

Baby Kidnap

Stomach Pain: కడుపునొప్పి వస్తుందని టాయ్‌లెట్‌కు వెళ్లిన యువతి అనుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యునైటెడ్ కింగ్ డమ్ లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న జెస్ డేవిస్ అనే 20ఏళ్ల యువతి ఆశ్చర్యకరంగా డెలివరీ అయింది. పీరియడ్ సరిగా రాకపోవడంతోనే కడుపునొప్పి వస్తుందని భావిస్తుంటే ఇలా జరిగిందని వివరించింది.

బ్రిస్టల్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో హిస్టర్, పాలిటిక్స్‌లో మిస్ డేవిస్ పొలిటిక్స్ స్టూడెంట్ గా ఉంది. కడుపులో బాబు కదలికలు, ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమీ లేకపోవడంతో అస్సలు గమనించలేదు. అదీ కాకుండా మెన్‌స్ట్రువల్ సైకిల్ కూడా రెగ్యూలర్ గా ఉండేది కాదని అందుకే అదేం సమస్య కాదనుకున్నట్లు తెలిపింది.

ఇప్పుడు ఆ 20ఏళ్ల యువతి జూన్ 11న తల్లి అయి 3కేజీల బిడ్డకు జన్మనిచ్చింది. “నాకు బిడ్డ పుట్టడమంటేనే జీవితంలో పెద్ద షాక్. నేనేదో కలలో ఉన్నాననుకున్నా. ఆ ఏడుపు వినేంత వరకూ నిజమిదని రియలైజ్ కాలేకపోయా. ఇప్పుడు నాపై బాధ్యతలు పెరిగిపోయాయి. ముందు షాక్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు సంతోషం పీక్స్ లో ఉంది” అని పేర్కొంది.

Read Also: 65కిలోమీటర్లు కాలి నడకన గర్భిణీ.. చివరకు రోడ్డుపై ప్రసవం

జూన్ 2022లో చాలా ఇబ్బందిగా అనిపించి.. పీరియడ్ నొప్పి అనుకుని లేచా. నడవడం కాదు కదా, కూర్చోవడానికి, బెడ్ మీద పడుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించిందట.

“ఆ రోజు ముందు రాత్రి నాకు బర్త్ డే పార్టీ కావడంతో రెండో రోజు స్నానం చేస్తే కాస్త బెటర్ గా ఉంటుందనుకున్నా. కానీ, ఆ తర్వాతే పెయిన్ మరింత పెరిగిపోయింది. టాయిలెట్ లోకి వెళ్లిన తర్వాత కూడా అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. నేనొక బిడ్డకు జన్మినిస్తున్నానని రియలైజ్ కాలేకపోయా. ఎప్పుడైతే నా కొడుకు ఏడుపు వినిపించిందో అప్పుడు షాక్ అయ్యా. ఆ తర్వాత నమ్మకం కుదిరింది నేను తల్లినయ్యానని” అని ఆ తల్లి చెప్పింది.

అలా ఒంటరిగా బిడ్డను కని ఆ ఫొటో ఫ్రెండ్ కు పంపడంతో వాళ్లు కూడా షాక్ అయ్యారట. వెంటనే అంబులెన్స్ తీసుకురావడంతో హాస్పిటల్ కు వెళ్లారట. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న డేవిస్, ఆమె కొడుకు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.