Suez Canal: ఎవర్‌గివెన్ నౌక.. సూయెజ్ కెనాల్ అథారిటీ డీల్‌ ఫిక్స్

ఎట్టకేలకు ఫైనాన్షియల్ డీల్ సెటిల్ చేసుకున్నామని చెప్పింది సూయెజ్ కెనాల్ అథారిటీ. సంవత్సరారంభంలో ఇరుక్కుపోయిన షిప్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టం నుంచి కోలుకోనున్నట్లు స్పష్టం చేసింది.

Suez Canal: ఎవర్‌గివెన్ నౌక.. సూయెజ్ కెనాల్ అథారిటీ డీల్‌ ఫిక్స్

Suez Canal Ship (1)

Suez Canal: ఎట్టకేలకు ఫైనాన్షియల్ డీల్ సెటిల్ చేసుకున్నామని చెప్పింది సూయెజ్ కెనాల్ అథారిటీ. సంవత్సరారంభంలో ఇరుక్కుపోయిన షిప్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టం నుంచి కోలుకోనున్నట్లు స్పష్టం చేసింది. కాకపోతే Shoei Kisen Kaisha Ltdతో సెట్ చేసుకున్న డీల్ గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. బుధవారానికి ఈ వెస్సల్ లోడ్ అంతా ఖాళీ అయిపోనుంది.

ఈజిప్ట్ సూయెజ్ కెనాల్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ మాట్లాడుతూ.. కాంపన్సేషన్ అమౌంట్ చెల్లించడానికి పార్టీలు అంగీకరించాయని తెలిపారు. ఈ అగ్రిమెంట్ గురించి పబ్లిక్ గ్రా ప్రకటించదలచుకోలేదని అన్నారు.

తైవాన్‌లోని ‘ఎవర్‌గ్రీన్‌ మెరైన్‌’ అనే సంస్థకు చెందిన ఈ షిప్.. . సూయజ్‌ కాలువలోని దక్షిణపు ఒడ్డువైపున ఇది ఇసుకలో కూరుకుపోయి కాలువకు అడ్డంగా ఉండటంతో మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు ఆగిపోయాయి.

సరకు రవాణాకు తీవ్ర అంతరాయం కలగడంతో వేల కోట్లలో నష్టం వాటిల్లింది. ఈ పరిహారం చెల్లించాలని సదరు కంపెనీలు డిమాండ్ చేశాయి. ఆ అమౌంట్ తగ్గించాలంటూ కాంపన్సేషన్ కోసం ట్రై చేశాయి. ముందుగా 916 మిలియన్ డాలర్లు డిమాండ్ చేయగా దానిని 550మిలియన్ డాలర్లకు సూయెజ్ కెనాల్ అథారిటీ తగ్గించింది.