Sweet Shop: అక్కడ కేజీ స్వీట్ రూ.16వేలు.. పైన పూతే స్పెషల్

దేశీ మిఠాయిలకు ఇండియాలో ఫుల్ గిరాకీ. గులాబ్ జామూన్, లడ్డూ, కాజూ కట్లీ లాంటివాటి గురించి తెలియని ఇండియన్ ఉండడు. సాధారణంగా స్వీట్ షాపుల్లో కలాకాని లాంటి స్వీట్లపై వెండి పూత ఉంటుంది.

Sweet Shop: అక్కడ కేజీ స్వీట్ రూ.16వేలు.. పైన పూతే స్పెషల్

Kg Sweet

Sweet Shop: దేశీ మిఠాయిలకు ఇండియాలో ఫుల్ గిరాకీ. గులాబ్ జామూన్, లడ్డూ, కాజూ కట్లీ లాంటివాటి గురించి తెలియని ఇండియన్ ఉండడు. సాధారణంగా స్వీట్ షాపుల్లో కలాకాని లాంటి స్వీట్లపై వెండి పూత ఉంటుంది. వెండి పూత వరకూ ఓకే కానీ, బంగారపు పూత ఎప్పుడైనా చూశారా..

ఇండియన్ మిఠాయి మీద గోల్డ్ ప్లేట్ వేసి అమ్ముతున్నారు కాబట్టే కేజీ రూ.16వేల వరకూ పలుకుతుంది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఉన్న షగుణ్ స్వీట్స్‌లో ఇది దొరుకుతుందట. దీని గురించి అర్జున్ చౌహాన్ అనే ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ వీడియోలో స్వీట్ పైన బంగారపు లేయర్ ఎలా అమరుస్తున్నారు. పైన కుంకుమ లేదా కేసరి అమర్చి గార్నిష్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది.

పైగా ఆ వీడియోకు కేజీ స్వీట్ రూ.16వేలు.. మీ రిచ్ ఫ్రెండ్‌ను ట్యాగ్ చేయండంటూ క్యాప్షన్ పెట్టాడు. డిసెంబర్ 26న పెట్టిన ఈ పోస్టుకు 10.9మిలియన్ వ్యూస్ దక్కించుకోగా, బోలెడు రియాక్షన్స్, కామెంట్స్ వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్‌తో పొత్తుపై చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ!

ఫుడ్ ఐటెం మీద గోల్డ్ అమర్చడం తొలిసారేం కాదు. గతేడాది దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో రాయల్ గ్రాండ్ బిర్యానీ లాంచ్ చేశారు. స్పెషల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇక్కడ ప్రోగ్రాంలు చేస్తారు. ఈ బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరు దక్కించుకుంది. గోల్డ్ బిర్యానీని 23క్యారెట్స్ గోల్డ్ తో గార్నిష్ చేస్తారు. దీని ధర వెయ్యి దినార్లు పలుకుతుండగా.. రూపాయల్లో చెప్పాలంటే 19వేల 742 అని తెలుస్తుంది.