Tajikistan: దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని ఆదేశించిన తజికిస్తాన్

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఆదేశించిన తొలి దేశంగా నిలిచింది తజికిస్తాన్. పిల్లలను మినహాయించి అంతా వ్యాక్సినేషన్ చేయించుకుని కరోనావైరస్ ను తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చింది.

Tajikistan: దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని ఆదేశించిన తజికిస్తాన్

Vaccination

Tajikistan: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఆదేశించిన తొలి దేశంగా నిలిచింది తజికిస్తాన్. పిల్లలను మినహాయించి అంతా వ్యాక్సినేషన్ చేయించుకుని కరోనావైరస్ ను తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చింది. మహమ్మారి వ్యతిరేక నియమాల గురించి ఆ దేశం ఇలా ప్రకటించింది.

ఆ నిర్ణయం ప్రకారం.. కరోనావైరస్ పై పనిచేసే వ్యాక్సిన్ ను 18ఏళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారు ఫ్యామిలీ డాక్టర్ ను కానీ, స్థానిక ఆరోగ్య కేంద్రంలోనైనా సంప్రదించాలి. తజికిస్తాన్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉంటుందని ప్రభుత్వం కన్ఫామ్ చేసిన రెండో రోజే ఈ ప్రకటన చేసింది.

అఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కైర్గిజ్ స్తాన్, చైనా సరిహద్దులు గల దేశంలో జూన్ 21 నుంచి వ్యాప్తి పెరిగిందని హెల్త్ మినిష్ట్రీ కన్ఫామ్ చేసింది. దేశవ్యాప్తంగా 260కేసులు నమోదుకాగానే అలర్ట్ అయింది. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 13వేల 569మాత్రమే. ఐదు నెలలుగా ఒక్క కేసు కూడా లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న దేశం.. మరోసారి కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది.

ఇతర దేశాల కంటే వ్యాక్సినేషన్ చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతుంది తజికిస్తాన్ లో. 2లక్షల 80వేల మంది మాత్రమే వ్యాక్సినేషన్ వేసుకోగా..ఇంకా దేశ జనాభాలో 18వేల 600 మందికి వ్యాక్సినేషన్ చేపట్టాల్సి ఉంది.