రాహుగ్రస్త సూర్యగ్రహణం, ఇలా చూస్తే చాలా ప్రమాదం

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ప్రారంభమైంది. సూర్యగ్రహణాల్లో

  • Published By: naveen ,Published On : June 21, 2020 / 06:15 AM IST
రాహుగ్రస్త సూర్యగ్రహణం, ఇలా చూస్తే చాలా ప్రమాదం

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ప్రారంభమైంది. సూర్యగ్రహణాల్లో

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ప్రారంభమైంది. సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.04 గంటల వరకు సూర్యగ్రహణం కొనసాగుతుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో గ్రహణం వీడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు గ్రహణం దర్శనమిస్తుంది.

రింగ్ ఆఫ్ ఫైర్:
కాగా, ఈసారి ఏర్పడిన సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్(జ్వాలా వలయ సూర్యగ్రహణం) అంటున్నారు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా(Ring Of Fire) పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది. ఈ ఏడాదిలో(2020) ఇదే తొలి సూర్యగ్రహణం. పలు ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆకాశంలో వలయాకారంలో కనువిందు చేస్తోంది.

నేరుగా చూస్తే కళ్లకు ప్రమాదం:
సూర్యగ్రహణాన్ని నేరుగా చూడొద్దని శాస్త్రవేత్తలు కోరారు. సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమన్నారు. అలా చూడటం కళ్లకు మంచిది కాదన్నారు. కంటిలో రెటీనా దెబ్బ తింటుందని హెచ్చరించారు. అంతేకాదు గ్రహణాన్ని మొబైల్ తో ఫొటోలు, వీడియోలు తీయకూడదు. తగిన రక్షణ జాగ్రత్తలతో వైద్యులు సూచించిన ఎక్లిప్స్‌ అద్దాలతో, ఫిల్టర్‌ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దృశ్యాన్ని చూడాలన్నారు. కాగా, గ్రహణం కారణంగా భూమిపైకి వచ్చే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్‌ కొంతమేరకు (0.001 శాతం) నశించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఇక గర్బిణులు గ్రహణం చూడొద్దని, గ్రహణ సమయంలో భోజనం చేయొద్దని, గ్రహణం ముగిశాక స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇలాంటివి నమ్మొద్దని హేతువాదులు అంటున్నారు.

చూడామణి యోగంలో జపం, దాన, ధర్మాలు చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితం:
జ్యోతిషం ప్రకారం.. శార్వరీ నామ సంవత్సరం జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం మృగశిర నక్షత్రం, మిథున రాశిలో రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది దక్షిణభారతంలో ఖండగ్రాసం, ఉత్తర భారతంలో కంకణాకారంలో కనిపిస్తుంది. దీన్నే ‘చూడామణి యోగం’అని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇది విశేషమైన సూర్యగ్రహణమని పండితులు అంటున్నారు. ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం, సోమవారం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడితే దాన్ని చూడామణి యోగంగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సాధారణ గ్రహణ సమయంలో చేసే జపం, దాన, ధర్మాలు చూడామణి యోగంలో చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

* ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటేనే ఆహార పదార్దాలు పాడవుతాయి
* సూర్యకిరణాలతో ఎలాంటి ప్రభావం ఉండదు
* గర్భిణులకు ఎలాంటి కీడు జరగదు
* గ్రహణాన్ని నేరుగా చూడొద్దు
* మొబైల్ తో ఫొటోలు, వీడియోలు తీయకూడదు
* సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ ను వాడాలి
* కడుపులో బిడ్డపై చెడు ప్రభావం అనేది అపోహ మాత్రమే
* విగ్రహాలు ముట్టుకోకూడదనేది అపోహ

Read: ఫాదర్స్ డే-2020: గూగుల్ డూడుల్.. మీ నాన్నకు ఇలా గ్రీటింగ్ కార్డ్ పంపండి