Suicide Bombers : తాలిబన్ మరో సంచలన నిర్ణయం..ఆర్మీలోకి సూసైడ్ బాంబర్లు!

అప్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అప్ఘాన్ రక్షణ

Suicide Bombers : తాలిబన్ మరో సంచలన నిర్ణయం..ఆర్మీలోకి సూసైడ్ బాంబర్లు!

Taliban (1)

Taloban : అప్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అప్ఘాన్ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసమంటూ తాలిబన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం అప్ఘాన్ లో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్..తమ శత్రువు అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ISIS) నుంచి ఎదురయ్యే అతిపెద్ద భద్రత ముప్పును ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా తాలిబన్ ప్రభుత్వం..బాంబులు పేల్చి మారణహోమం సృష్టించే సూసైడ్ బాంబర్లను ఆర్మీలోకి అధికారికంగా రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. తాలిబన్ నిర్ణయంతో ఇకపై అప్ఘాన్ ఆర్మీలో సూసైడ్ బాంబర్లు కూడా భాగం కానున్నారు.

కాగా,గతేడాది తాలిబన్లు అప్ఘాన్ ని చేజిక్కుంచుకోవడానికి ముందు,సూసైడ్ బాంబర్లను ముఖ్య ఆయుధంగా తాలిబన్ ఉపయోగించిన విషయం తెలిసిందే. గత 20 ఏళ్లుగా తాలిబన్ … అప్ఘాన్ భద్రతా బలగాలు-అప్ఘాన్ లో నాలుగు నెలల క్రితం వరకు అమెరికా దళాలలపై సూసైడ్ బాంబర్లు ద్వారా ఎటాక్ లు జరిపింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న సూసైడ్ బాంబర్ల దళాలను ఒక గొడుగు కిందకు తీసుకురావాలని,అప్ఘాన్ ను కాపాడేందుకు వీరందరినీ అధికారికంగా ఆర్మీలో చేర్చాలని నిర్ణయించినట్లు తాలిబన్ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరిమి తెలిపారు. సూసైడ్ బాంబర్లతో..దేశవ్యాప్తంగా,సరిహద్దుల వద్ద భద్రతను మరింత బలోపేతం కోసం శక్తివంతమైన,ఆర్గనైజ్డ్ ఆర్మీని తాలిబన్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

మరింత అధునాతమైన,స్పెషల్ ఆపరేషన్లకు వీరిని ఉపయోగించనున్నట్లు తెలిపారు. సూసైడ్ బాంబర్ల ముఖ్య లక్ష్యం ప్రస్తుతానికి..స్థానికంగా ఐసిస్ తెగబడుతున్న దాడులను అడ్డుకోవడమేనని తెలిపారు. గతేడాది ఆగస్టులో అప్ఘాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అప్ఘాన్ గడ్డపై ఐదు భారీ దాడులకు పాల్పడింది ఐసిస్ ఉగ్రసంస్థ. ఇందులో పలు దాడులు సూసైడ్ బాంబర్లు ద్వారా పాల్పడినట్లు తెలుస్తోంది.

మరోవైపు, తాజాగా అప్ఘాన్ నేషనల్ టెలివిజన్ లో తాలిబన్ జీహాదీ రిక్రూట్స్ కి సంబంధించిన వీడియో ఒకటి ప్రసారం అయింది. అప్ఘాన్ లోని ఓ గుర్తు తెలియని స్థావరంలో తాలిబన్ జెండా చేతిలో పట్టుకని తాలిబన్ అనుచరులు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గతవారం ప్రసారమైన ఈ ప్రచార వీడియోలో సూసైడ్ బాంబర్లు ఉపయోగించే కిట్ కూడా కనిపిస్తోంది. సూసైడ్ వెస్ట్స్,ఎక్స్ ప్లోజివ్స్,మైన్స్,కార్ బాంబ్స్,గన్స్,రాకెట్స్ కూడా ఆ కిట్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.

అప్ఘానిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దుల్లో మన్సూర్ ఆర్మీ అనే ఓ ప్రత్యేకమైన దళాన్ని తాలిబన్ రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఈ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ ప్రత్యేక దళం సూసైడ్ దాడులకు పాల్పడుతుందని, గత అప్ఘాన్ ప్రభుత్వ భద్రతా బలగాలును,దాని పాశ్చాత్యా మిత్రులను టార్గెట్ చేసుకుంటుందని వార్తలు వినిపించాయి.

ALSO READ PM Modi: పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతితో మోదీ భేటీ