PM Modi: పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతితో మోదీ భేటీ

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో గురువారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ని కలిశారు మోదీ. బుధవారం తన పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై

PM Modi: పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతితో మోదీ భేటీ

Modi Kovind

PM Modi : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో గురువారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ని కలిశారు మోదీ. బుధవారం తన పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై ఈ సమావేశంలో రాష్ట్రపతితో మోదీ చర్చించారు. మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

మరోవైపు, ప్రధాని పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మోదీతో ఫోన్​లో మాట్లాడినట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా చర్యలపై పఠిష్ఠ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

కాగా,రెండేళ్ల తర్వాత బుధవారం పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి అనూహ్య పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు రహదారిని అడ్డుకోగా..దాదాపు 20 నిమిషాల పాటు ఫిరోజీ పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా ఏరియాకు దగ్గర్లో ఉన్న ఓ ఫ్లైఓవర్​పై మోదీ కాన్వాయ్ ఆగిపోయింది. దీంతో ఆకస్మికంగా పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరుగుముఖం పట్టారు ప్రధాని. ఈ విషయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. పంజాబ్​ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

ఇదిలావుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ALSO READ Tollywood : సినీ పరిశ్రమలో కొత్త వారసులు.. అల్లుళ్లదే హవా