Taliban : ఆప్ఘానిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్‌ నిషేధిస్తూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు

ఆఫ్ఘానిస్తాన్ లో విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్‌ నిషేధిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. కాబూల్‌ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు జారీ చేసిన మొదటి ఫత్వా ఇదే.

Taliban : ఆప్ఘానిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్‌ నిషేధిస్తూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు

Afgan Taliban

ban co-education in Afghanistan : తాలిబన్లు ఏ మాత్రం మారలేదు. మహిళలపై ఆంక్షలు అమలు చేయబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు. ఆఫ్ఘానిస్తాన్ లోని విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్‌ను నిషేధిస్తూ తాలిబన్లు ఫత్వా జారీ చేశారు. మహిళల హక్కులు కాపాడతామని ప్రకటించిన కొన్ని రోజులకే కో ఎడ్యుకేషన్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు జారీ చేసిన మొదటి ఫత్వా ఇదే.

ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలన్నింటిలోనూ కో ఎడ్యుకేషన్‌ను నిషేధించారు. సమాజంలోని అన్ని రకాల చెడులకూ మూలం కో ఎడ్యుకేషనే అని తాలిబన్లు ఆరోపించారు. యూనివర్శిటీ ప్రొఫెసర్లు, ప్రయివేట్ సంస్థల యజమానులతో మూడు గంటల పాటు సమావేశమై చర్చించిన తాలిబన్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే కాలేజీలలో మహిళా లెక్చరర్లను అనుమతిస్తామని చెప్పారు. అయితే వారు అమ్మాయిలకు మాత్రమే బోధించాలని…అబ్బాయిలకు పాఠాలు చెప్పకూడదని తాలిబన్లు తెలిపారు.